#గుసగుస: అగ్ర హీరోయిన్ అనూహ్యంగా ఎందుకిలా?
సినీ పరిశ్రమలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ప్రముఖ నటీమణులు ఒక్కసారిగా సౌండ్ చేయకుండా లైమ్ లైట్ నుంచి తప్పుకుంటే ఆటోమేటిక్‌గా రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తాయి.
సినీ పరిశ్రమలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ప్రముఖ నటీమణులు ఒక్కసారిగా సౌండ్ చేయకుండా లైమ్ లైట్ నుంచి తప్పుకుంటే ఆటోమేటిక్‌గా రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తాయి. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సరిగ్గా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రముఖ అగ్ర హీరోయిన్ గత కొంతకాలంగా బహిరంగ వేదికలపై కనిపించకపోవడం, మీడియా కంట పడకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాధారణంగా స్టార్ సెలబ్రిటీలు తమ సినిమాల ప్రమోషన్లు లేదా సామాజిక కార్యక్రమాల ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.. కానీ అలాంటివేమీ లేకుండా సుదీర్ఘ విరామం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పరిణామానికి ప్రధాన కారణం ప్రముఖ అగ్ర హీరోతో ఈ బ్యూటీ సాన్నిహిత్యం చుట్టూ జరుగుతున్న ప్రచారమేనని తెలుస్తోంది. నటుడిగా ఉండి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆ అగ్ర హీరోతో ఈ నటి సంబంధాలపై సోషల్ మీడియాలో విపరీతమైన ఊహాగానాలు సాగాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న సమీకరణాలు.. గతంలో జరిగిన కొన్ని ఓపెన్ మీటింగులు పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే వస్తున్న రూమర్లకు చెక్ పెట్టడానికే ఆమె ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రస్తుతం ఇదే అంశంపై రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. నెటిజన్లు, సినీ విశ్లేషకులు ఈ అసాధారణ మౌనం వెనుక ఉన్న ఆంతర్యంపై ఎవరికి తోచిన విధంగా వారు వాదనలు వినిపిస్తున్నారు. ఒకవైపు సినిమా ప్రాజెక్ట్‌లకు విరామం ఇవ్వడం.. మరోవైపు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఇలా కనిపించకుండా దాగుడుమూతలు ఆడుతున్నారని కూడా గుసగుస వినిపిస్తోంది. ఏది ఏమైనా ఒకప్పటి ట్రెండింగ్ నటి ఇలా అకస్మాత్తుగా పబ్లిక్ సర్కిల్స్‌కు దూరమవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మరోవైపు సదరు అగ్ర హీరో రాజకీయాల్లోకి వెళ్లి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణంలో...ఆయన చుట్టూ జరిగే ప్రతి పరిణామం మీడియాలో హైలైట్ అవుతోంది. ఈ కారణంగానే అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇరువురూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలు లేదా ఈవెంట్స్ సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ గ్యాప్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లలో కలిసి కనిపించకపోవడం ద్వారా ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ విషయమై అటు వైపు నుంచి కానీ. ఇటు నటి తరపు నుంచి కానీ ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. అయితే వెండితెరపై ఒక వెలుగు వెలిగిన ఆ అగ్ర హీరోయిన్ ఎందుకు ఇంతలా సైలెంట్ అయ్యారనే ప్రశ్న మాత్రం ఫ్యాన్స్ లో అలాగే ఉంది. భవిష్యత్తులో ఈ నటి మళ్ళీ తన సాధారణ లైఫ్‌స్టైల్‌కు ఎప్పుడు వస్తారు? సినిమాల్లో పూర్తి స్థాయిలో రీఎంట్రీ ఇస్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. తెలుగులో ఈ అగ్ర నటి నటించిన భారీ చిత్రం విడుదలకు రావాల్సి ఉంది.