• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్, తారక్… ఫస్ట్...

ప్రభాస్, తారక్… ఫస్ట్ ఛాయస్ ఎవరు?

| సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ఈ ఏడాది అతని ముందు రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి

By - Tupaki Desk
Update: 2024-01-04 04:04 GMT

సలార్ సినిమాతో హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ ఈ ఏడాది అతని ముందు రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ లో తారక్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ ఏడాదిలోనే ఆ సినిమా స్టార్ట్ అవుతుందని మైత్రీ నిర్మాతలు అంటున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ కూడా తారక్ మూవీ పూర్తయిన తర్వాత సలార్ 2 ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే సలార్ మూవీ సూపర్ హిట్ కావడంతో ఏడాదిలోపే సలార్ 2ని కూడా రిలీజ్ చేస్తే ఇంపాక్ట్ ఉంటుందని ప్రభాస్ భావిస్తున్నారు. అందుకే వీలైనంత వేగంగా సలార్ 2 కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని ప్రశాంత్ నీల్ తో డిస్కస్ చేస్తున్నారంట. ఈ విషయాన్ని నిర్మాత విజయ్ కిరంగదూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. 2015 ఆరంభంలోనే సలార్ 2 రిలీజ్ అవుతుందని బలంగా చెబుతున్నారు.

వీలైనంత వేగంగా షూటింగ్ స్టార్ట్ చేస్తామని కూడా చెబుతున్నారు. అయితే ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది అర్ధం కాని విషయంగా ఉంది. ఓ వైపు తారక్ దేవర మూవీ కంప్లీట్ చేసి హిందీలో ఒప్పుకున్న వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వాలి. ఆ సినిమా కోసం మూడు నెలలు కాల్ షీట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. అయితే ఈ దేవర ఎప్పుడు పూర్తవుతుందనేది క్లారిటీ లేదు.

మరో వైపు ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న కల్కితో పాటు మారుతితో చేస్తోన్న రాజా డీలాక్స్ సినిమాలు కంప్లీట్ చేయడమే కాకుండా ఈ ఏడాదిలోనే థియేటర్స్ లోకి తీసుకొని రావాలి. అవి పూర్తి కాకుండా మరో సినిమాకి కాల్ షీట్స్ ఎలా అడ్జస్ట్ చేయగలడు అనేది సందేహహాస్పదంగానే ఉంది. కాని ప్రశాంత్ నీల్ మాత్రం ఏదో ఒక ఆప్షన్ తీసుకొని అయితే తారక్ మూవీ, లేదంటే సలార్ ని ఈ ఏడాదిలో సెట్స్ పైకి తీసుకొని వెళ్తేనే తన క్యాలెండర్ కరెక్ట్ గా ఉంటుంది.

ఇటు మైత్రీ, అటు హోంబలే నిర్మాణ సంస్థలు రెండూ కూడా తమ సినిమానే ముందుగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఛాయస్ మాత్రం ప్రశాంత్ నీల్ చేతిలో ఉంది. అలాగే ప్రభాస్ తోనే ముందుగా సలార్ 2 చేయడానికి ఛాన్స్ తీసుకునే అవకాశం కూడా ఉందని టాక్ వినిపిస్తోంది.

Tags:    
  • Prashanthneel 
  • Mythrimakers 
  • Prabhas 
  • Salaar 
  • NTR 
  • Salaar2 
  • Filmindustry 
  • War2 

Similar News

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

2026-11-07 06:50 GMT

43 ఏళ్లలో కూడా తరగని అందం.. నెట్ సారీలో త్రిష అందాలు!

2026-11-07 06:47 GMT

Copyright @2026

Powered by Blink CMS