• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక...

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

| ఫరా ఖాన్ తన తొలి చిత్రం ‘మై హూ నా’లో శ్రేయా ఘోషల్‌ను ఎంపిక చేసుకోవడంపై బాలీవుడ్ ప్రముఖుల నుంచి వ్యతిరేకత ఎదురైందని గుర్తుచేసుకున్నారు. అప్పటికి 18 ఏళ్ల వయసున్న కొత్త గాయనిని భారీ ప్రాజెక్ట్‌కు తీసుకోవడం రిస్క్ అని పలువురు హెచ్చరించినా, సంగీత దర్శకుడు అను మాలిక్‌తో కలిసి ఆమె ప్రతిభపై నమ్మకంతో ముందుకెళ్లినట్లు తెలిపారు. ఆ సినిమాలోని పాటలు హిట్ కావడంతో శ్రేయా కెరీర్‌కు బలమైన పునాది పడింది.

By - Srikanth Kontham
Update: 2026-11-07 08:51 GMT

బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ తొలి సినిమా `మై హూ నా` చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని తాజాగా పంచుకున్నారు. ఈ చిత్రంలో అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించిన స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్‌ను ఎంపిక చేసిన సమయంలో ఇండస్ట్రీ నుంచి తనకు ఎలాంటి వ్యతిరేకత ఎదురైందో ఫరా గుర్తు చేసుకున్నారు. 18 ఏళ్ల వయసున్న ఒక కొత్త గాయనిని అంతపెద్ద ప్రాజెక్ట్‌కి తీసుకోవడంపై పలువురు తనను హెచ్చరించినట్లు ఫరా తెలిపారు. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన `మై హూ నా` చిత్రం ద్వారా సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన శ్రేయా ఘోషల్ ప్రయాణం అంత సులువుగా మొదలుకాలేదు.

సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన `దేవ్‌దాస్` సినిమా ద్వారా ప‌రిచ‌యం అయినా? ఆ సినిమా పాటలు ఆ సమయానికి ఇంకా విడుదల కాలేదు. దీంతో ఇండస్ట్రీలో శ్రేయా ఎవరో పెద్దగా ఎవరికీ తెలియదు. అయినా సంగీత దర్శకుడు అను మాలిక్ తో కలిసి ఫరా ఖాన్ ప్రతిభపై పూర్తి నమ్మకంతో ముందుకెళ్లాల‌ని నిర్ణయిం చుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై బాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు ఫరా ఖాన్‌కు ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. అనుభవం లేని నూతన గాయనిని ఇంత పెద్ద బడ్జెట్ చిత్రానికి తీసుకోవడం పెద్ద రిస్క్ అని.. ఇది భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుందని హెచ్చరించారు.

అయినా? ఎవరి మాటలను లెక్కచేయకుండా తన చిత్రానికి సరికొత్త స్వరం కావాలనే పట్టుదలతో ఫరా ఖాన్ ఆ వెనుకంజ వేయలేదని తెలిపారు.శ్రేయా ఘోషల్ టాలెంట్‌ను గుర్తించిన క్షణాలను ఫరా గుర్తుచేసుకుంటూ.. టైటిల్ సాంగ్‌లో అమృత రావు కోసం ఆమె పాడిన చిన్న పోర్షన్ విన్నప్పుడే తనకు ఆమెపై నమ్మకం కుదిరిందన్నారు. ఆ తర్వాతే సుస్మితా సేన్ పై వచ్చే ప్రధాన పాటను కూడా శ్రేయాతో పాడించానని తెలిపారు. ఆ సమయంలో తెరపై సుస్మితా అందాన్ని చూసి తన గొంతు ఆ స్థాయికి న్యాయం చేయగలదా లేదా అని శ్రేయా స్వయంగా ఎంతో టెన్షన్ పడినట్లు గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

చివరికి అను మాలిక్ సంగీతం, జావేద్ అక్తర్ సాహిత్యం , శ్రేయా ఘోషల్ అద్భుతమైన గాత్రం కలయికలో వచ్చిన `మై హూ నా` టైటిల్ సాంగ్ అలాగే `తుమ్హే జో మైనే దేఖా` పాటలు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచాయి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా శ్రేయా ఘోషల్ కెరీర్‌కు బలమైన పునాది వేసింది. ఇండస్ట్రీలో అందరూ వారించినా ప‌రా తీసుకున్న ఒక్క సాహసోపేతమైన నిర్ణయమే నేడు దేశం గర్వించదగ్గ దిగ్గజ గాయనిని ఇండస్ట్రీకి పరిచయం చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Tags:    
  • farahkhan 
  • shreyaghoshal 
  • mainhoonna 
  • anumalik 
  • bollywoodmusic 

Similar News

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS