• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు 'లీక్స్' కాదు.....

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

| దీంతో అసలు ఏ సినిమా సంక్రాంతికి వస్తుందనే చర్చ మొదలైంది. ఆ గందరగోళానికి రైటర్ కోన వెంకట్ తన సోషల్ మీడియా పోస్టుతో ఆన్సర్ ఇచ్చారు.

By - M Prashanth
Update: 2026-11-07 06:50 GMT

మెగాస్టార్ సినిమాలంటే అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదేమో. తన సినిమాలకు సంబంధించి అప్పుడప్పుడు ఈవెంట్లలో చిన్న చిన్న విషయాలు బయటపెడుతుంటారు చిరంజీవి. వాటినే ఫ్యాన్స్ చిరు లీక్స్ అంటూ సరదాగా పిలుచుకుంటారు. అయితే ఇప్పుడు వారు కోరుకుంటున్నది కొత్త లీక్స్ కాదు.. తమ అభిమాన హీరో సినిమాల విడుదల తేదీలపై ఫుల్ క్లారిటీ. ముఖ్యంగా 'కాకా', 'విశ్వంభర' సినిమాల విషయంలో కొంతకాలంగా సాగుతున్న ప్రచారంతో మెగా అభిమానుల్లో గందరగోళం నెలకొంది.

చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'కాకా'. భారీ అంచనాలు ఉన్న ఆ మూవీ షూటింగ్ ఆగిపోయిందని, స్క్రిప్టులో మార్పులు జరుగుతున్నాయని, విడుదల వాయిదా పడే అవకాశం ఉందని రీసెంట్ గా ప్రచారం మొదలైంది. మరోవైపు ఆ సినిమా బదులు చిరంజీవి నటించిన 'విశ్వంభర' సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపించాయి.

దీంతో అసలు ఏ సినిమా సంక్రాంతికి వస్తుందనే చర్చ మొదలైంది. ఆ గందరగోళానికి రైటర్ కోన వెంకట్ తన సోషల్ మీడియా పోస్టుతో ఆన్సర్ ఇచ్చారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ 'కాకా' గురించి వస్తున్న వార్తలను ఖండించారు. సినిమా ఆగిపోలేదని, అనుకున్న ప్రకారమే విడుదలకు సిద్ధమవుతోందని క్లారిటీ ఇచ్చారు. 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. దీంతో 'కాకా' విడుదలపై వస్తున్న ప్రచారానికి కొంతవరకు స్పష్టత వచ్చింది.

అయితే 'కాకా' విడుదల తేదీపై కోన వెంకట్ క్లారిటీ ఇచ్చారు సరే.. మరి 'విశ్వంభర' సంగతేంటి? ఆ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సోషియో ఫాంటసీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌ కు టైమ్ పడుతుండటంతో సినిమా రిలీజ్ ఆలస్యమవుతోంది. అందుకే 'కాకా' వాయిదా పడితే 'విశ్వంభర' సంక్రాంతికి వస్తుందనే ప్రచారం మొదలైంది. ఇప్పుడు కోన వెంకట్ పోస్టుతో సంక్రాంతి బరిలో 'కాకా' ఉన్నట్లే.

కానీ 'విశ్వంభర' విడుదల తేదీపై మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజానికి పెద్ద హీరోల సినిమాల విషయంలో ఇలాంటి ప్రచారాలు రావడం కొత్తేమీ కాదు. ఒక సినిమా షూటింగ్ ఆలస్యమైనా, విడుదల తేదీ మారినా వెంటనే రూమర్లు మొదలవుతాయి. చివరకు అసలు విషయం ఏమిటో తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎదురుచూడాల్సి వస్తుంది. చిరంజీవి సినిమాల విషయంలో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

అప్పుడప్పుడు ఈవెంట్లలో ఆయన చెప్పే చిన్న విషయాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ ఇప్పుడు వాళ్లు ఆశిస్తున్నది లీక్స్ కాదు.. రెండు సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ. రైటర్లు, దర్శకులు స్పందించడం కన్నా నిర్మాణ సంస్థల నుంచి వచ్చే ఇన్ఫోకి మరింత వాల్యూ ఉంటుంది. షూటింగ్ ఎంతవరకు పూర్తయింది, రిలీజ్ ఎప్పుడనే విషయాలను ఎప్పటికప్పుడు రివీల్ చేస్తే ఇలాంటి రూమర్లు తగ్గుతాయి. అందుకే చిరు నుంచి కొత్త లీక్స్ కోసం ఎదురుచూసే అభిమానులు.. ఈసారి మాత్రం రెండు సినిమాలపై ఫుల్ క్లారిటీ కోరుకుంటున్నారు.

Tags:    
  • chiranjeevi 
  • kaaka 
  • vishwambhara 
  • megastarchiranjeevi 
  • tollywood 

Similar News

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS