• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వేలాది మంది, వందల...

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

| ‘రామాయణ’ సినిమాలో రావణుడు, జటాయువు మధ్య జరిగే యుద్ధ సన్నివేశం కోసం దర్శకుడు నితేష్ తివారీ ఆరున్నరేళ్లు కష్టపడ్డారు. పుష్పక విమానం డిజైన్‌ కోసం 40 నుంచి 50 స్కెచ్‌లు రూపొందించగా, దాని తయారీకే రెండున్నరేళ్లు పట్టిందని ఆయన వెల్లడించారు. వేలాది మంది టెక్నీషియన్లు పనిచేసిన ఈ సన్నివేశంలోని వీఎఫ్‌ఎక్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటూ ప్రశంసలు వస్తున్నాయి.

By - Ramesh Palla
Update: 2026-11-07 09:24 GMT

ఇండియన్ సినీ ప్రేక్షకులు రెండేళ్లుగా ఎదురు చూస్తున్న 'రామాయణ' మూవీ వచ్చేసింది. సినీ ప్రేమికులకు మూడు రోజుల ముందే దీపావళిని తీసుకు వచ్చిందని యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఇండియన్‌ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమాకు ఖర్చు చేయని విధంగా ఈ సినిమా కోసం నిర్మాతలు ఖర్చు చేశారు, ఇప్పటి వరకు హాలీవుడ్‌ వరకే పరిమితం అయిన అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్ టెక్నాలజీని రామాయణ సినిమా కోసం వాడుతున్నట్లు మొదటి నుంచి చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వస్తున్నారు. దర్శకుడు నితేష్ తివారీ పదేళ్ల కలకు ఈ సినిమా రూపం. నితేష్‌ తో పాటు నిర్మాతలు, టెక్నీషియన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరూ ఒక యజ్ఞం చేసినట్లుగా వర్క్‌ చేశారని బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇండియన్‌ సిల్వర్‌ స్క్రీన్‌ పై రామాయణంను మరోసారి ఆవిష్కరించడం జరిగింది.

రావణ, జటాయు యుద్ద సన్నివేశం...

ఈ సినిమా మేకింగ్‌ సమయంలో మేకర్స్ చాలా అరుదుగా మాత్రమే మీడియా ముందుకు వచ్చారు, సినిమా అప్‌డేట్స్ ఇచ్చారు. సినిమా విడుదల సమయంలో మొత్తం హడావిడి కనిపించింది. మేకింగ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను దర్శకుడు నితేష్‌ తివారీ మీడియాతో షేర్‌ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా సినిమాలో వచ్చే రావణ, జటాయువు యుద్దం గురించి రిలీజ్‌కి ముందు దర్శకుడు నితేష్ తివారీ పదే పదే చెప్పడం చాలా మందికి అతిగా అనిపించింది. ఒకానొక సమయంలో ఆ సీన్‌ కోసం ఆరున్నర ఏళ్లు కష్టపడ్డట్లు చెప్పాడు. రావణుడి విమానం మొదలుకుని, జటాయువు రూపం, ఆ సమయంలో జరిగే యుద్దంను విజువలైజ్ చేయడం, స్కెచ్‌లు వేయడం, డిజిటల్‌ ఆర్ట్‌ వంటి పనులకు ఏకంగా ఆరున్నర ఏళ్ల సమయం పట్టిందని నితేష్‌ తివారీ చెప్పాడు. ఆ సమయంలో ఆయన మాటలు అతిశయోక్తి అంటూ చాలా మంది కామెంట్‌ చేశారు.

రావణుడి పుష్పక విమానం డిజైన్‌...

రామాయణ విడుదల తర్వాత ఆ సీన్‌ చూస్తుంటే మేకర్స్‌ పడ్డ కష్టం కనిపిస్తుంది. టెక్నికల్‌ పరిజ్ఞానం ఏమాత్రం ఉన్నా ఆ సీన్‌లో ఉన్న డిటైల్స్ ను అర్థం చేసుకుంటే దర్శకుడు నితేష్ తివారీ ఆ సమయంలో అన్నమాట వాస్తవమే అనిపించక మానదు. అసలు రామాయణకు అత్యంత కీలకమైన ఆ సీన్‌ కోసం నితేష్ పడ్డ కష్టం కి నూరు శాతం ప్రతిఫలం దక్కినట్లే అనడంలో సందేహం లేదు. ఇంతకు ఆ సమయంలో నితేష్ తివారీ ఏమన్నాడో మరోసారి చూద్దాం.. ఆ ఒక్క ఫైట్‌ సీన్ చేయడం కోసం తమకు ఆరున్నర ఏళ్ల సమయం పట్టింది. ఆర్టిస్టులకు, వీఎఫ్‌ఎక్స్ టీంకు నేను కథ వివరించినప్పటి నుంచి ఈ సన్నివేశం పూర్తి చేయడానికి ఆరున్నర ఏళ్ల సమయం పట్టింది. ఈ ఒక్క సీన్‌ కోసం వేలాది మంది టెక్నీషియన్స్‌ వర్క్‌ చేశారు, కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం. రావణుని పుష్పక విమానం రెడీ చేయడానికి చాలా సమయం తీసుకున్నాం. ఆ విమానం డిజైన్‌ కోసం 40 నుంచి 50 స్కెచ్‌లు వేశాం. వాటిని డిజైన్‌లుగా మార్చి వీఎఫ్‌ఎక్స్‌ చేశాం.

రామాయణలో వీఎఫ్‌ఎక్స్‌ కి ఆస్కార్‌...?

పుష్పక విమానం తయారీకి మా టీంకు ఏకంగా రెండున్నర ఏళ్ల సమయం పట్టింది. మొదట్లో అనుకున్న పుష్పక విమానంలో రావణుడితో జటాయువు యుద్ధం సరిగ్గా రాకపోవడంతో తిరిగి మరో పుష్పక విమానం రెడీ చేసి ఆ సీన్‌ ను మళ్లీ చేయాల్సి వచ్చింది. ఆ సీన్‌ కోసం కొరియోగ్రఫీ, వీఎఫ్‌ఎక్స్‌, ఫైట్ సీక్వెన్స్‌ ఇలా ప్రతి ఒక్కటీ మళ్లీ మళ్లీ చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం పట్టింది. సినిమాలో ఆ సీన్‌ ను వండర్‌గా చూపించేందుకు చాలా కష్టపడ్డట్లుగా ఆయన పేర్కొన్నారు. వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. 3డిలో చూసిన వారు, బిగ్‌ స్క్రీన్‌ పై చూసిన వారికి ఆ సీన్‌ మంచి హైప్‌ ఇస్తుంది. సినిమా మొత్తం విజువల్ వండర్‌గా మేకర్స్ రూపొందించినా ఈ సీన్‌ అంతకు మించి అన్నట్లుగా ఉందని ప్రేక్షకులు, రివ్యూవర్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్‌ సినిమాలను మించి, ఆస్కార్‌ అవార్డ్‌ రేంజ్‌ లో వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    
  • ramayana 
  • niteshtiwari 
  • pushpakavimana 
  • ravana 
  • vfx 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS