• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ ఫైట్ సీన్ పై...

ప్రభాస్ ఫైట్ సీన్ పై ప్రశాంత్ వర్మ రియాక్షన్ ఇదీ!

| ప్రభాస్ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ పై ప్రశాంత్ నీల్ రియాక్ట్ అవ్వడం ఇప్పుడు అభిమానులను దృష్టిని ఆకర్షిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-11-21 08:15 GMT

రెబల్ స్టార్ ప్రభాస్, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా తెరక్కనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించిన అధికారిక ప్రకటన రాబోతోందని ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి రోజులో న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తున్న తరుణంలో.. ప్రభాస్ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ పై ప్రశాంత్ నీల్ రియాక్ట్ అవ్వడం ఇప్పుడు అభిమానులను దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' పార్ట్-1 సినిమాలో కాటేరమ్మ ఫైట్‌ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్భుతంగా డిజైన్ చేసిన ఈ భారీ యాక్షన్ సీన్ లో ప్రభాస్ తన విశ్వరూపం చూపించారు. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించిన ఈ సీన్.. సినిమాలోని హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. అంత హై ఇచ్చింది కాబట్టే ఈ ఫైట్ ను ఓటీటీలో రిపీట్ మోడ్ లో చూస్తుంటారు.

తాజాగా ఓ నెటిజన్ దుఃఖాన్ని, హార్ట్ బ్రేక్స్ ను ఎలా ఎదుర్కొంటారో చెప్పమని పోస్టు పెట్టగా.. దానికి డార్లింగ్ ఫ్యాన్ స్పందిస్తూ "మగవాళ్ళు బాధలో ఉన్నప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఓపెన్ చేసి, 'సలార్' మూవీలోని కాటేరమ్మ ఫైట్ సీన్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు" అని బదులిచ్చాడు. సలార్ పోస్టర్ ను జత చేసాడు. ఈ మీమ్ పై ఎక్స్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ స్పందించారు. "అవును! పురుషులు సాధారణ జీవులు!" అని కామెంట్ పెట్టారు.

నిజానికి ఇక్కడ ఆ నెటిజన్ ప్రశాంత్ వర్మను ట్యాగ్ కూడా చెయ్యలేదు. అయినా ఈ పోస్టుపై రియాక్ట్ అయ్యారు. దీంతో ప్రభాస్ - ప్రశాంత్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అభిమానులు ఫిక్స్ అవుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ‘హనుమాన్‌’ దర్శకుడితో సినిమా ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికి "బ్రహ్మ రాక్షస" అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. మరి త్వరలోనే ఈ కాంబినేషన్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ప్రభాస్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో 'ది రాజాసాబ్' సినిమా చేస్తున్నారు. ఈ రొమాంటిక్ హార్రర్ కామెడీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇటీవలే హను రాఘవపూడి డైరెక్షన్ లో 'ఫౌజీ' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఇదే క్రమంలో వచ్చే నెలలో సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' మూవీని మొదలు పెట్టనున్నారు. ఇవి కాకుండా 'సలార్: పార్ట్ 2 - శౌర్యంగ పర్వం', 'కల్కి 2' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి.

మరోవైపు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం 'హను-మాన్' సీక్వెల్ గా 'జై హనుమాన్' సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో కన్నడ హీరో రిషబ్ శెట్టి టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. అలానే నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు ప్రశాంత్. ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో రూపొందే మరికొన్ని చిత్రాలకు కథలు అందిస్తున్నారు.

Yes! Men are simple creatures! https://t.co/yfMfogM0f6

— Prasanth Varma (@PrasanthVarma) November 21, 2024
Tags:    
  • Prabhas 
  • Prasanthvarma 
  • Katerammafight 
  • Prabhasprasanthmovie 
  • Meme 
  • Prasanthtweets 
  • Salaarmovie 
  • Netflix 
  • Tollywood 
  • Filmindustry 
  • Pvcu 
  • Rajasaab 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS