• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పట్టువిడువని ప్రశాంత్...

పట్టువిడువని ప్రశాంత్ వర్మ.. ఆ స్టార్ దొరికేనా?

| యంగ్ టైగర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు.

By - Tupaki Desk
Update: 2024-12-14 11:01 GMT

యంగ్ టైగర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ తర్వాత ఇప్పటి వరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. పాన్ ఇండియా రేంజ్ లో హనుమాన్ బ్లాక్ బస్టర్ కొట్టడంతో వెంటనే దానికి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఆరంభంలో ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం హీరోలు దొరకలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టి రణవీర్ సింగ్ తో కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. అతనికి కథ చెప్పి ఒకే చేయించుకున్నాడు.

ఈ సినిమా పట్టాలు ఎక్కే సమయంలో క్యాన్సిల్ అయ్యింది. క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ రద్దయ్యిందని క్లారిటీ వచ్చింది. తరువాత నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోనే సూపర్ హీరో కథతోనే ఈ సినిమా ఉంటుందని ఎనౌన్స్ చేశారు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయడంతో ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి షూటింగ్ ని వెళ్లాలని డిసైడ్ అయ్యారు.

100 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి నిర్మాతలు కూడా సిద్ధమయ్యారు. అయితే షూటింగ్ మొదలవుతుందనుకునే రోజే సడెన్ గా మూవీ హోల్డ్ లో పడిందనే టాక్ బయటకొచ్చింది. మోక్షజ్ఞ ఆరోగ్యం బాగోకపోవడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని బాలయ్య చెప్పారు. అయితే అంతర్గతంగా ఇంకేదో జరిగిందనే మాట వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అనుకుంటున్నారు.

వాస్తవం ఏంటనేది బయటకి రాలేదు. మరో వైపు ‘జై హనుమాన్’ కోసం రిషబ్ శెట్టిని మెయిన్ లీడ్ గా తీసుకున్నారు. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే రిషబ్ శెట్టి ప్రస్తుతం ‘కాంతారా 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాకే ‘జై హనుమాన్’ స్టార్ట్ చేస్తారు. ఈ లోపు డార్లింగ్ ప్రభాస్ తో కథ ఫైనల్ చేయించుకోవాలని ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారంట. ఇదివరకే రెండు మూడు సార్లు కలిశారు. కానీ కథ విషయంలో ప్రభాస్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని టాక్. అయినప్పటికీ మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

వీలైనంత వేగంగా ప్రభాస్ ని ఒప్పించి ఈ సినిమా అయిన పట్టాలు ఎక్కించాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ కథ విషయంలో ప్రభాస్ నిర్మాతలు సంతృప్తి చెందితే జనవరిలోనే ఈ మూవీకి సంబంధించి అధికారిక కన్ఫర్మేషన్ రావొచ్చని అనుకుంటున్నారు. ఇక ప్రభాస్ లైనప్ చాలా బిజీగా వుంది. ప్లాన్ చేసినా డేట్స్ దొరకడం అంత ఈజీ కాదు. ఇక రిషబ్ శెట్టి ఈ మూవీకి కథ అందించాడని ప్రచారం జరుగుతోంది. అయితే అందులో వాస్తవం ఎంత అనేది తెలియదు. ఈ సినిమాని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    
  • Prasanthvarma 
  • Prabhas 
  • Tollywood 
  • Mokshagna 
  • Rishabshetty 
  • JaiHanumanmovie 
  • Filmindustry 
  • Prasanthvarmamovies 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS