కంచె బ్యూటీ ప్రగ్య స్టన్నింగ్ లుక్
తాజాగా ప్రగ్య షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో గుబులు పెంచుతోంది.;
టాలీవుడ్, బాలీవుడ్ లో కథానాయికగా ఉనికిని చాటుకునేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది ప్రగ్య జైశ్వాల్. నేటితరం (జెన్ జెడ్) కథానాయికల నుంచి పోటీని ఎదుర్కొనేందుకు ఈ భామ నిరంతర సాధన, హార్డ్ వర్క్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. జిమ్ లో పర్ఫెక్ట్ గా కసరత్తులు చేస్తూ, యోగా సాధన చేస్తూ పరిశ్రమలో ఫిట్టెస్ట్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో తన ఫాలోవర్స్ కి అలుపన్నదే లేకుండా ఫోటో ట్రీట్ ఇస్తూనే ఉంది.
తాజాగా ప్రగ్య షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో గుబులు పెంచుతోంది. ప్రగ్య అందమైన మినీ ఫ్రాక్ లో థై అందాలను ప్రదర్శిస్తూ, రిసార్ట్ పార్టీలో చిల్ చేస్తూ కనిపించింది. బ్లాక్ కలర్ ఫ్రాక్ టాప్ లెస్ అందాలను ఆవిష్కరించడమే గాక, బాటమ్ లో థై సొగసుల్ని ఆవిష్కరిస్తోంది. కొందరు స్నేహితులతో కలిసి ఈ ట్రిప్ ని చాలా ప్రత్యేకంగా మార్చుకుంది ఈ ముంబై బ్యూటీ.
ప్రగ్య ధైర్యంగా, అధునాతనంగా, వంద శాతం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ బ్యూటీ పర్సనల్ ఫ్యామిలీ పార్టీలోను స్పెషల్ లుక్ తో కనిపించింది. ప్రస్తుతం అఖండ 2, టైసన్ నాయుడు చిత్రీకరణలో ప్రగ్య బిజీగా ఉంది. ఈ రెండు ప్రాజెక్టులతో తిరిగి టాలీవుడ్ లో బిగ్ కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తోంది. ఆట ఇంకా అయిపోలేదు.. ఇప్పుడే మొదలైందని ప్రగ్య నిరూపిస్తుందేమో చూడాలి.