అందాలతో హాట్ బాంబ్ పేల్చిన ప్రగ్యా జైస్వాల్..

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా తోటి నటీనటుల బర్తడే పార్టీలకు , పెళ్లిళ్లకు, ఇతర ఈవెంట్లకు హాజరవుతూ ఆ ఈవెంట్లలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-25 07:08 GMT

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా తోటి నటీనటుల బర్తడే పార్టీలకు , పెళ్లిళ్లకు, ఇతర ఈవెంట్లకు హాజరవుతూ ఆ ఈవెంట్లలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. అక్కడ తమ దుస్తులతోనే కాదు తమ అందాలతో కూడా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఆ ఈవెంట్ కే కొత్త అందాన్ని తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక బర్తడే పార్టీలో సందడి చేసిన బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఊహించని రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అటు సెలబ్రిటీలను కూడా తన అందంతో మెస్మరైజ్ చేసింది.

అసలు విషయంలోకి వెళ్తే.. రకుల్ ప్రీత్ సింగ్ భర్త ప్రముఖ నిర్మాత, నటుడు అయినా జాకీభగ్నాని పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు జాకీ భగ్నానీ.అలా బర్తడే వేడుకకు హాజరైన ప్రగ్యా జైస్వాల్ తన అందంతో అందరిని ఒక్కసారిగా మెస్మరైజ్ చేసింది. పింక్ కలర్ మినీ షాట్ ధరించిన ఈమె.. పాపారాజీల ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈమె అందాలను చూసిన అభిమానులు ప్రగ్యా అందాలతో హాట్ బాంబు పేల్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే తన గ్లామర్ తోనే అందర్నీ కట్టి పడేసింది ఈ ముద్దుగుమ్మ.

ప్రగ్యా జైస్వాల్ విషయానికి వస్తే.. 2014లో తమిళ్ చిత్రం విరాట్టు ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. ఆ తర్వాత 2015లో తెలుగు పీరియాడికల్ డ్రామా కంచె సినిమాతో మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది.. మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రగ్య కట్టు బొట్టుతో అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో అత్యుత్తమ నటన కనబరిచినందుకు గాను ఉత్తమ నూతన నటి విభాగంలో గద్దర్ అవార్డును దక్కించుకుంది. అలాగే సౌత్ ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది.

తెలుగులో మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. అటు హిందీ రంగ ప్రవేశం చేసింది. అక్కడ టిటూ ఎంబీఏ అనే సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో నక్షత్రం , ఆచారి అమెరికా యాత్ర వంటి చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ సినిమాతో ఊహించని పాపులారిటీ లభించింది. అంతేకాదు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలు వస్తాయనుకున్నారు కానీ పెద్దగా ఈమెకు అవకాశాలు తలుపు తట్టలేదు. తర్వాత మళ్లీ బాలయ్యతో కలిసి డాకు మహారాజ్ సినిమాలో నటించిన ఈమె ప్రస్తుతం టైసన్ నాయుడు అనే సినిమాలో నటిస్తోంది.. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News