పవర్ మెడల్స్ వెనుక వేణుస్వామీ పూజలు.. ప్రగతి స్ట్రాంగ్ కౌంటర్!
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి రీసెంట్ గా ఇంటర్నేషనల్ లెవెల్ లో సత్తా చాటారు.;
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి రీసెంట్ గా ఇంటర్నేషనల్ లెవెల్ లో సత్తా చాటారు. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఏకంగా నాలుగు పతకాలు సాధించి ఔరా అనిపించారు. ఈ వయసులో ఆమె డెడికేషన్ చూసి ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయ్యింది. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆమెను ఆకాశానికెత్తేశారు. జిమ్ లో ఆమె పడే కష్టం, వర్కవుట్స్ వీడియోలు చూసిన వారికి ఈ మెడల్స్ వెనుక ఉన్న శ్రమ ఏంటో అర్థమవుతుంది.
అయితే ప్రగతి విజయం వెనుక తన పూజల బలం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రగతి తన కెరీర్ కోసం, స్పోర్ట్స్ లో ఎదగడం కోసం తన దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకుందని, అందుకే ఇప్పుడు పతకాలు వచ్చాయని ఆయన ఒక వీడియోలో చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు నిజంగానే పూజల వల్ల మెడల్స్ వచ్చాయా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు.
ఈ వ్యవహారంపై ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న ప్రగతి ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. తన గెలుపును వేణుస్వామి తన ఖాతాలో వేసుకోవడంపై ఆమె స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టారు. అవును నేను ఆయన దగ్గరకు వెళ్ళింది నిజమే కానీ అది ఇప్పుడు కాదు, దాదాపు రెండున్నరేళ్ల క్రితం అని ఆమె అసలు ట్విస్ట్ ఇచ్చారు. అప్పుడు తాను చాలా లో ఫేజ్ లో ఉన్నానని, అందుకే వెళ్లానని క్లారిటీ ఇచ్చారు.
తన స్నేహితులు రిఫర్ చేయడంతో, ఆ సమయంలో ఉన్న మానసిక పరిస్థితి బాగోలేక పూజలు చేయించుకున్నట్లు ప్రగతి ఒప్పుకున్నారు. కష్టకాలంలో ఎవరైనా ఇలాంటివి నమ్ముతారని, కానీ ఆ పూజల వల్ల తనకు పెద్దగా ఫలితం కనిపించలేదని ఆమె కుండబద్దలు కొట్టారు. అప్పుడెప్పుడో జరిగిన పూజల తాలూకు ఫోటోలను ఇప్పుడు బయటపెట్టి, ఈ విజయానికి లింక్ చేయడం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
తన కష్టాన్ని పక్కనపెట్టి, కేవలం పూజల వల్లే గెలిచానని చెప్పుకోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆయన కామెంట్స్ ను ఆయన విజ్ఞతకే, సంస్కారానికే వదిలేస్తున్నా అంటూ చాలా హుందాగా రిప్లై ఇచ్చారు. ఏడాది క్రితం ఫోటోలను ఇప్పుడు వైరల్ చేసి క్రెడిట్ తీసుకోవాలనుకోవడం సరికాదని ఆమె ఇన్ డైరెక్ట్ గా చురకలు అంటించారు.
ప్రగతి ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదానికి చెక్ పడింది. ఆమె సాధించిన పతకాలు కేవలం ఆమె కఠోర శ్రమ ఫలితమే తప్ప, పూజల మహిమ కాదని నెటిజన్లు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. గ్రౌండ్ లో కష్టపడి చిందించి సాధించిన విజయాలను ఇలా పక్కదారి పట్టించడం తగదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.