స్టార్ యాంకర్ మరోటి రెడీ చేస్తున్నాడా..?

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పాపులారిటీ గురించి తెలిసిందే.

Update: 2024-05-10 06:01 GMT

బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పాపులారిటీ గురించి తెలిసిందే. ముందు సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన ప్రదీప్ ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ షిఫ్ట్ అయ్యి అక్కడ తన సత్తా చాటాడు. మేల్ యాంకర్స్ లో నెంబర్ 1 అనిపించుకున్న ప్రదీప్ అడపాదడపా సినిమాల్లో కూడా కనిపిస్తూ వచ్చాడు. అయితే బుల్లితెర మీద ఉన్న ఈ ఇమేజ్ తో హీరోగా సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా చేశాడు. ఆ సినిమా తో సక్సెస్ అందుకున్న ప్రదీప్ మళ్లీ బుల్లితెరకే అంకితమయ్యాడు.

అయితే లేటెస్ట్ గా ఢీ డ్యాన్స్ షో నుంచి ప్రదీప్ ఎగ్జిట్ అయ్యాడు. దాదాపు 10 సీజన్ల దాకా ప్రదీప్ ఢీ షో హోస్ట్ గా చేస్తూ వచ్చాడు. యాంకర్ గా ప్రదీప్ ఉండటం వల్ల షో చాలా సరదాగా సాగింది. ఢీ షోలో యాంకర్ గా ప్రదీప్ బదులుగా కొత్తగా నందు వచ్చాడు. ఢీ షో ఎగ్జిట్ అవ్వడం వెనక ప్రదీప్ మరో సినిమా చేయాలనే ప్లాన్ ఉందని అంటున్నారు. అందుకోసమే తన ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాడు ప్రదీప్.

ఈమధ్యనే జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ కనిపించాడు ప్రదీప్. ఆ ఫోటోలు చూస్తే ప్రదీప్ నుంచి మరో సినిమా రాబోతుందని అనుకున్నారు. లేటెస్ట్ గా తన క్రేజీ లుక్స్ తో మరోసారి సోషల్ మీడియాని సర్ ప్రైజ్ చేశాడు ప్రదీప్. క్యాప్ పెట్టుకుని ప్రదీప్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. కచ్చితంగా ఈ ప్రిపరేషన్ తన నెక్స్ట్ సినిమా కోసమే అని ఆడియన్స్ అనుకుంటున్నారు.

Read more!

వారానికో సినిమా రిలీజ్ అవుతున్న తెలుగు పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోవాలంటే కొత్తగా ట్రై చేయాల్సిందే. ప్రదీప్ హీరోగా చేసిన తొలి ప్రయత్నం సూపర్ హిట్ కాగా సెకండ్ అటెంప్ట్ కోసం బాగా టైం తీసుకున్నాడు. ప్రదీప్ హీరోగా రెండో సినిమా ఎప్పుడు చేస్తాడని అతని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ప్రదీప్ సినిమా కోసమే ఇదంతా చేస్తున్నాడా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. ప్రదీప్ హీరోగా చేస్తే చూడాలని అతని బుల్లితెర ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి రెండో ప్రయత్నం ఎలాంటి సినిమాతో వస్తాడన్నది ఆడియన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Tags:    

Similar News