• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'స్పిరిట్'తో ప్రభాస్...

'స్పిరిట్'తో ప్రభాస్ అలాంటి సాహసం చేస్తారా?

| ఇటీవలే 'కల్కి 2898 AD' సినిమాతో రెండోసారి 1000 కోట్ల క్లబ్ లో చేరిన రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు

By - Tupaki Desk
Update: 2024-08-07 07:47 GMT

ఇటీవలే 'కల్కి 2898 AD' సినిమాతో రెండోసారి 1000 కోట్ల క్లబ్ లో చేరిన రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు. డార్లింగ్ ఆల్రెడీ కమిటైన చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ ''స్పిరిట్'' కూడా ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ క్రేజీ మూవీ తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి నెలలు గడిచిపోయింది. అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్, విలన్ గురించి గత కొన్ని రోజులుగా నెట్టింట అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

'స్పిరిట్' సినిమాలో సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ అలియాస్ లీ డాంగ్-సియోక్ విలన్ గా నటిస్తారని ఆ మధ్య వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రతినాయకుడిగా కనిపిస్తారని ఓ కొత్త పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో 'వర్షం'లో నటించిన వీరిద్దరూ రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఒకరినొకరు ఢీకొట్టబోతున్నారని అంటున్నారు. మరోవైపు ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తారని, హీరోగానే కాకుండా విలన్‌ గా నటించే సాహసం చేయబోతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

'స్పిరిట్' అనేది పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి అందరూ కోరుకుంటున్నట్లు లీ డాంగ్ సియోక్ నే విలన్ రోల్ కోసం ట్రై చేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్ అవ్వకపోతే, ఎవరైనా హాలీవుడ్ యాక్టర్ ను సంప్రదిస్తారే తప్ప టాలీవుడ్ యాక్టర్ ను మెయిన్ విలన్ గా తీసుకోకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉంటే 'స్పిరిట్' మూవీలో హీరోయిన్ గురించి కూడా అనేక రూమర్స్ వస్తున్నాయి. ప్రభాస్ కు జోడీగా కరీనా కపూర్ ఖాన్ ను తీసుకుంటారని అప్పట్లో ఓ వార్త వినిపించింది. ఇప్పుడు సౌత్ క్వీన్ త్రిష కృష్ణను కథానాయికగా ఎంపిక చేస్తారనే న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో 'వర్షం' 'పౌర్ణమి' 'బుజ్జిగాడు' చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ జంట.. దాదాపు 16 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసి నటిస్తారని అంటున్నారు. దీనిపై డార్లింగ్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

త్రిష దక్షిణాదిలో ఇప్పటికీ క్రేజీ హీరోయిన్ గా రాణిస్తున్నప్పటికీ, ఆమెకు పాన్ ఇండియా ఇమేజ్ లేదు కాబట్టి ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్ ను ప్రభాస్ కు జోడీగా సెట్ చేస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్ బ్యూటీనే కావాలని అనుకుంటే 'బాహుబలి' 'బిల్లా' 'మిర్చి' చిత్రాల్లో ప్రభాస్‌తో అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్న అనుష్క శెట్టిని ఫిక్స్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. మరి సందీప్ వంగా 'స్పిరిట్' కోసం ఫైనల్ గా ఎవరిని ఫైనలైజ్ చేస్తారో వేచి చూడాలి.

''స్పిరిట్'' అనేది ఒక కాప్ డ్రామా అని దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రభాస్ నిజాయితీగల పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. డార్లింగ్ ఇంతవరకూ చేయని క్యారక్టర్ కావడంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టి సిరీస్‌, యూవీ క్రియేషన్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, వంగా ప్రణయ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

Tags:    
  • Prabhas 
  • Therajasaab 
  • Sandeepvanga 
  • Gopichand 
  • Trisha 
  • Spiritmovie 
  • Donlee 
  • Sandeepreddyvanga 

Similar News

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

Copyright @2026

Powered by Blink CMS