క‌న్న‌ప్ప‌కు క‌ల్కీ నాలుగు రోజులేనా!

మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియాలో `కన్నప్ప` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-05-10 07:27 GMT

మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియాలో `కన్నప్ప` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. న్యూజిలాండ్ షూటింగ్ ముగించుకుని అక్క‌డ నుంచి హైద‌రాబాద్ కి ఇటీవ‌లే షిప్ట్ అయింది. అటుపై హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో కొన్ని రోజుల పాటు షూటింగ్ జరిగింది. అనంత‌రం కొంత గ్యాప్ త‌ర్వాత య‌ధావిధిగా మ‌ళ్లీ అక్క‌డే షూట్ మొద‌లైంది. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కూడా కీల‌క పాత్ర పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఆయ‌న కూడా సెట్స్ కి వెళ్ల‌డం మొద‌లైంది. ప్ర‌త్యేకంగా వేసిన సెట్లో ప్ర‌భాస్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో ప్ర‌భాస్ నందీశ్వ‌రుడి పాత్ర‌లో క‌నిపిస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఆ పాత్ర‌లో ప్ర‌భాస్ ఆహార్యం అదిరిపోయింద‌ని చూసిన వారు చెబుతున్నారు. నాలుగు రోజుల పాటు ఈ షూట్ కొన‌సాగ‌నుందిట‌. ఇందులో కేవ‌లం ప్ర‌భాస్ పై మాత్ర‌మే ఈ నాలుగు రోజులు షూట్ చేస్తార‌ని తెలుస్తోంది. ముందుగా ఆయ‌న పై షూట్ పూర్తి చేసి పంపిస్తే త‌ర్వాత నెమ్మ‌దిగా మిగ‌తా న‌టీన‌టుల‌పై చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొచ్చ‌న్న‌ది ప్లాన్ గా తెలుస్తోంది.

Read more!

ప్ర‌భాస్ ఎంట్రీ ఈ సినిమాకి పెద్ద అస్సెట్ గా చెప్పొచ్చు. పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన డార్లింగ్..విష్ణు సినిమాలో న‌టిస్తున్నాడంటే క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ప్ర‌భాస్ బ్రాండ్ తోనే బోలెడంత బిజినెస్ జ‌రుగుతుంది. గతంలో వచ్చిన `భక్త కన్నప్ప` లో నందీశ్వరుడి పాత్ర ఉండదు. కేవలం శివుడికి .. కన్నప్పకి మధ్య సీన్స్ మాత్రమే ఉంటాయి. ఈ సినిమాలో నందీశ్వరుడి పాత్రను డిజైన్ చేశారు. అది ప్ర‌భాస్ కోస‌మే సృష్టించారా? అన్న‌ది అభిమానుల వెర్ష‌న్.

ఇతర కీలకమైన పాత్రలలో అక్షయ్ కుమార్ .. మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ .. మోహన్ బాబు తదితరులు పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మోహ‌న్ బాబు భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. మోహ‌న్ బాబు పై ఉన్న అభిమానంతో ప్ర‌భాస్ పారితోషికం తీసుకోకుండా న‌టిస్తున్నాడ‌ని ప్ర‌చారం లో ఉంది. మోహ‌న్ బాబు చెక్ పంపిచినా ..డార్లింగ్ అభిమానంతో రిజెక్ట్ చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

Tags:    

Similar News