• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజా సాబ్ తెలివైన...

రాజా సాబ్ తెలివైన నిర్ణయం..!

| కల్కితో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ బాహుబలి 2 తర్వాత మరో 1000 కోట్లు అందుకున్నాడు

By - Tupaki Desk
Update: 2024-07-18 06:26 GMT

కల్కితో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్ బాహుబలి 2 తర్వాత మరో 1000 కోట్లు అందుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ చేస్తున్న సినిమాలు అవి సృష్టిస్తున్న సంచలనాలు ఇవన్నీ ఫ్యాన్స్ కి పండగ చేసుకునేలా చేస్తున్నాయి. కల్కి 2898 ఏడి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాను కూడా సాధ్యమైనంతవరకు ఈ ఇయర్ ఎండింగ్ లో కానీ లేదా నెక్స్ట్ ఇయర్ జనవరిలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా నిర్మిస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని తెలుస్తుంది. కల్కి లాంటి విజువల్ వండర్ తర్వాత ప్రభాస్ ఈసారి ఎంటర్టైనర్ తో రాబోతున్నాడని తెలుస్తుంది. రాజా సాబ్ సినిమా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తుందని అంటున్నారు. ఐతే సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే ఇక మిగతా సినిమాలన్నీ తప్పుకోవాల్సిందే. కల్కి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి రాజా సాబ్ మీద మరింత అంచనాలు ఉంటాయి. ఐతే ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఎట్టిపరిస్థితుల్లో నవంబర్ కల్లా పూర్తి చేసి కుదిరితే డిసెంబర్ 20 లేదా జనవరి మొదటి వారం రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ క్రిస్మస్ రేసులో సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ఐతే ప్రభాస్ క్రిస్ మస్ కి ఐదు రోజులు ముందు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఒకవేళ అప్పుడు కుదరకపోతే మాత్రం జనవరి మొదటి వారం అంటే 5, 6 తేదీల్లో ఈ సినిమా రిలీజ్ చేసే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి టార్గెట్ గా ఆల్రెడీ సినిమాలన్నీ రిలీజ్ షెడ్యూల్ చేసుకున్నాయి. పొంగల్ కి రాజా సాబ్ వస్తే మళ్లీ గొడవ మొదలవుతుంది. అందుకే సంక్రాంతికి కాకుండా జనవరి ఫస్ట్ వీక్ లోనే ఈ సినిమా చేయాలని అనుకుంటున్నారు. రాజా సాబ్ సినిమా డిసెంబర్ 20 లేదా జనవరి మొదటి వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.

ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా విషయంలో మారుతి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది.

Tags:    
  • Prabhas 
  • Rajasaab 
  • Maruthi 
  • Tollywood 
  • Filmindustry 
  • Rajasaabrelease 
  • Kalki2898ad 
  • Nidhiaggarwal 
  • Malavikamohanan 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS