అఫీషియల్.. ప్రభాస్ జీవితంలోకి ఒకరు రాబోతున్నారు

ఇంతకీ ప్రభాస్ ఏమన్నాడు అంటే.. డార్లింగ్స్.. ఫైనల్ గా మన జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు.. వెయిట్ చేయండి.. అంటూ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.

Update: 2024-05-17 06:03 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా కనిపిస్తూ ఉంటాడు. ఇక తన పర్సనల్ లైఫ్ అనేది చాలా ప్రైవేట్ గా ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రభాస్ ఎలాంటి హడావిడి లేకుండా తన లైఫ్ ను కొనసాగిస్తూ ఉంటాడు. సినిమాలు ఉంటే తప్ప బాహ్య ప్రపంచంలో పెద్దగా కనిపించడు. ఇక అతని సోలో లైఫ్ గురించి చాలా కాలంగా ఎన్నో రకాల గాసిప్స్ అయితే వైరల్ అవుతున్నాయి.

 

ముఖ్యంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనే విషయం నిత్యం ఫ్యామిలీలో కూడా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక ప్రభాస్ చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సినిమాలు తప్పితే ఇతర విషయాలపై కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వని ఈ స్టార్ హీరో ఊహించిన విధంగా తన జీవితంలోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు అన్నట్లుగా పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ప్రభాస్ ఇంతకు ఏ విషయం గురించి ఇలా వివరణ ఇచ్చాడు అనేది కాస్త సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ప్రభాస్ ఏమన్నాడు అంటే.. డార్లింగ్స్.. ఫైనల్ గా మన జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు.. వెయిట్ చేయండి.. అంటూ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. దీంతో అందరూ కూడా ప్రభాస్ పెళ్లి విషయంలో ఏదైనా క్లారిటీ ఇస్తాడా అనే విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు.

పెళ్లి టాపిక్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ విషయంపై ప్రభాస్ పెద్దగా రియాక్ట్ కాడు. ఫ్యామిలీలో కూడా చాలాసార్లు ఈ విషయం చర్చల్లోకి వచ్చింది. కానీ ప్రభాస్ మాత్రం ఎవరికీ సరైన సమాధానం మాత్రం చెప్పడం లేదు. సోలో లైఫ్ సో బెటర్ అనే విధంగానే ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఇక ప్రభాస్ లవ్ లో ఉన్నాడు అనే విధంగా చాలామంది హీరోయిన్స్ పేర్లు కూడా గతంలో వైరల్ అయ్యాయి.

Read more!

ఇక ఆ విషయంపై కూడా ప్రభాస్ ఎప్పుడు పెద్దగా రియాక్ట్ కాలేదు. ఇక ఇప్పుడు సడన్ గా కల్కి సినిమా హడావిడి మొదలయ్యే క్రమంలో ఈ విధంగా పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రభాస్ నిజంగానే షాక్ ఇస్తాడా లేదంటే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏమైనా ప్లాన్ వేశాడా? అనే విధంగా కూడా మరికొన్ని సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో చాలామంది హీరోలు కూడా ఇదేవిధంగా హడావిడి మొదలుపెట్టి సినిమాకు బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. మరి నిజానికి ప్రభాస్ ఐతే ఆ విధంగా ఎప్పుడు చేయడు. మరి ఈసారి ప్రభాస్ రాబోయే స్పెషల్ పర్సన్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.

Tags:    

Similar News