• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఖాన్‌ల‌ను వెన‌క్కి నెట్టి...

ఖాన్‌ల‌ను వెన‌క్కి నెట్టి ప్ర‌భాస్ నం.1 స్థానంలో

| ఈ ఘనత అతని తాజా చిత్రం 'కల్కి 2898 AD' భారీ విజయంతో సాధ్య‌మైంది.

By - Tupaki Desk
Update: 2024-07-22 08:57 GMT

భార‌త‌దేశంలో గొప్ప ప్ర‌జాద‌రణ పొందుతున్న స్టార్ ఎవ‌రో స‌ర్వేలు నిర్ధారిస్తున్నాయి. తాజాగా అందిన రిపోర్ట్ ప్ర‌కారం ప్ర‌భాస్ దేశంలో నంబ‌ర్‌-1 స్టార్ గా రికార్డుల‌కెక్కారు. జూన్ నెలలో ఓర్మాక్స్ మీడియా జాబితా ప్రకారం ఇటీవల అత్యంత ప్రజాదరణ పొందిన హీరోగా ప్రభాస్ జనాదరణ చార్టులలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ఘనత అతని తాజా చిత్రం `కల్కి 2898 AD` భారీ విజయంతో సాధ్య‌మైంది.

ప్రభాస్ 2024 మే నెలలోను అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా జాబితాలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ రెండవ స్థానంలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అల్లు అర్జున్, ఎన్టీఆర్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉండ‌గా, రామ్ చరణ్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. క‌థానాయిక‌ల్లో ఆలియా భట్ అగ్రస్థానంలో ఉండగా, సమంత రూత్ ప్రభు, దీపికా పదుకొనే తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

తాజా రిపోర్ట్ ప్ర‌జ‌ల్లో ప్రభాస్ విస్తృత ఆకర్షణ, ప్రభావాన్ని ఎలివేట్ చేస్తోంది. క‌థానాయ‌కుడిగా అత‌డికి ఉన్న ఆద‌ర‌ణ ఎలాంటిదో, ఛ‌రిష్మా ఎలాంటిదో కూడా ఆవిష్క‌రిస్తోంది. జాతీయ స్థాయిలో ఖాన్‌ల త్ర‌యం, క‌పూర్ లు, రోష‌న్‌లు ఒక‌ప్పుడు అని కూడా నిరూపిస్తోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన `కల్కి 2898 AD` ప్ర‌భాస్ స్థాయిని అమాంతం పెంచింది. రాజ‌మౌళి త‌ర్వాత ఈ ఘ‌న‌త నాగ్ అశ్విన్ కే ద‌క్కుతుంది. రాజ‌మౌళి త‌ర్వాత ప్ర‌భాస్ ఎంపిక చేసుకున్న బెస్ట్ డైరెక్ట‌ర్ కూడా నాగ్ అశ్విన్ అని చెప్పాలి. మ‌ధ్య‌లో ప్ర‌శాంత్ నీల్ కూడా స‌లార్ తో అత‌డి స్థాయిని పెంచాడు.

క‌ల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద ప‌లు రికార్డులను బద్దలు కొట్టి రూ. 1000 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. 12.15 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడవడంతో ఈ చిత్రం టిక్కెట్ల విక్రయాల్లో షారుఖ్ ఖాన్ `జవాన్`ను అధిగమించింది. క‌ల్కి చిత్రం పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. అనేక షోల టికెట్లు వేగంగా అమ్ముడయ్యాయి. ప్రభాస్ స్టార్ డ‌మ్ అంత‌కంత‌కు పెరుగుతోంద‌ని క‌ల్కి విజ‌యం మ‌రోసారి నిరూపించింది. ప్ర‌భాస్ న‌టిస్తున్న త‌దుప‌రి చిత్రాలు రాజా సాబ్, స‌లార్ 2, క‌ల్కి 2989ఏడి- 2 ఈ స్థాయిని మ‌రింత‌గా పెంచుతాయ‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Kalki2898AD 
  • Kalki 
  • Prabhas 
  • NagAshwin 
  • Ashwinidutt 
  • VyjayanthiMovies 
  • Shahrukhkhan 
  • Ntr 
  • Kalki2 
  • Salaar2 
  • Rajasaab 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS