• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బెంగ‌ళూరులో అల్లు...

బెంగ‌ళూరులో అల్లు ఫ్యాన్స్ వ‌ర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్

| సోషల్ మీడియాల్లో స్టార్ వార్ రెగ్యుల‌ర్ గా చూసేదే. స్టార్ల అభిమానుల మ‌ధ్య ఘోర‌మైన యుద్ధాల్ని చూస్తున్నాం.

By - Tupaki Desk
Update: 2024-03-11 03:46 GMT

సోషల్ మీడియాల్లో స్టార్ వార్ రెగ్యుల‌ర్ గా చూసేదే. స్టార్ల అభిమానుల మ‌ధ్య ఘోర‌మైన యుద్ధాల్ని చూస్తున్నాం. ఇరువురు స్టార్ల‌ అభిమానుల మధ్య మాటల యుద్ధం జరగడం తరచుగా చూస్తున్నాం. ఈ ఫ్యాన్ వార్‌లు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఒక భాగమే కానీ అవి తరచూ వింత‌గా వికృతంగా మలుపులు తీసుకుంటూ హద్దులు దాట‌డ‌మే ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అల్లు అర్జున్ - ప్రభాస్ అభిమానుల మ‌ధ్య ఇలాంటి గొడ‌వ‌లు నిత్య‌కృత్యంగా మారాయి. ఇప్పుడు అది బ‌హిరంగంగా కొట్లాట‌గా మార‌డ‌మే షాకిస్తోంది.

ఇంత‌కుముందు సోషల్ మీడియాల్లో అల్లు అర్జున్ అభిమానులు ప్రభాస్‌ను లాటరీ స్టార్‌గా అభివర్ణించారు. బాహుబలితో ప్రభాస్ అకస్మాత్తుగా ఫేమ్ అయ్యాడని, ఈ ఖ్యాతి అతడికి లాటరీ లాగా వచ్చాయని సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు వ్యాఖ్యానించారు. ప్రభాస్ కంటే అల్లు అర్జున్ ఉత్త‌మ‌ యాక్టర్, డ్యాన్సర్ అని కూడా అన్నారు అల్లు ఫ్యాన్స్. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ తన సినిమాలన్నింటితో పాన్ ఇండియా స్టార్‌డమ్‌ను పెంచుకుంటున్నాడని వారు పేర్కొన్నారు. అల్లు అర్జున్ నిజమైన పాన్ ఇండియా సూపర్ స్టార్ అని స‌మ‌ర్థించారు.

అయితే దీనికి ప్ర‌భాస్ అభిమానులు ధీటైన కౌంట‌ర్లు వేసారు. హిందీ సర్క్యూట్‌లో అల్లు అర్జున్ సినిమాల లైఫ్ టైమ్ క్లోజింగ్ కలెక్షన్స్, ఓపెనింగ్ వీకెండ్‌లో ప్రభాస్ సినిమాలు కలెక్ట్ చేసే దానితో సమానంగా ఉన్నాయని ప్రభాస్ అభిమానులు కౌంట‌ర్లు విసిరారు. ప్రభాస్ గురించి వ్యాఖ్యానించే ముందు అల్లు అర్జున్ అభిమానులు వారి రేంజ్ తెలుసుకోవాలని సూచించారు. ప్రభాస్ - అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఈ అగ్లీ వెర్బల్ వార్ నిరంత‌రం చ‌ర్చ‌నీయాంశ‌మే.

కానీ ఇప్పుడు బెంగ‌ళూరులోని ఒక క్రికెట్ గ్రౌండ్ లో ప్ర‌భాస్ అభిమానులు- అల్లు అర్జున్ అభిమానులు ఘ‌ర్ష‌ణ ప‌డ‌టం అందులో ఒక అభిమానికి తీవ్ర‌మైన గాయం అవ్వ‌డం సంచ‌ల‌న‌మే అయింది. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. క్రికెట్ గ్రౌండ్ లో ఇరువురు హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. అయితే అది చినికి చినికి గాలి వానైంది. చివ‌రికి అల్లు అర్జున్ అభిమానులు ప్ర‌భాస్ అభిమానిపై దాడికి దిగ‌డంతో అత‌డికి తీవ్ర గాయ‌మైంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచారించాల‌ని ఇప్పుడు ప్ర‌భాస్ ఫ్యాన్స్ కోరుతున్నారు. సోష‌ల్ మీడియాల్లో ఫ్యాన్ వార్ అనేది ఆరోగ్య‌క‌రంగా ఉండాలి. అలాగే త‌మ మ‌ధ్య జ‌రిగే ప‌బ్లిక్ గొడ‌వ‌లతో హీరోల పేరు చెడ‌గొట్ట‌డం స‌రికాద‌ని కొంద‌రు సూచిస్తున్నారు. ప్ర‌భాస్, అల్లు అర్జున్ విశ్వ‌వేదిక‌పై ఎదుగుతున్న పాన్ వ‌ర‌ల్డ్ స్టార్లు. దీనిని లోక‌ల్ ఫ్యాన్స్ ఇలాంటి గొడ‌వ‌ల‌తో చెడ‌గొట్ట‌డం స‌రికాదు!

Yeh kya howa bro, Ab har koi #Prabhas fans ko pelke jata hai.

Here is the full video where a #Prabhas fan is beaten by fans of Superstar #AlluArjun. pic.twitter.com/A62H9DN8nd

— Kattar Akkian (@CharlieBMCM) March 10, 2024
Tags:    
  • Prabhas 
  • Alluarjun 
  • Fans 
  • Beating 
  • Bangalore 
  • Cricketground 
  • Socialmedia 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS