• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ చేయగా లేనిది...

మహేష్ చేయగా లేనిది ప్రభాస్ చేయలేడా..?

| ఇక ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. మహేష్ డాన్స్ లతో అదరగొట్టడం చూసిన ప్రభాస్ తను కూడా ఫ్యాన్స్ కి ఒక మంచి డ్యాన్స్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు.

By - Tupaki Desk
Update: 2024-02-01 01:30 GMT

దేశం మొత్తం మెచ్చేలా నటన పరంగానే కాదు డ్యాన్సుల పరంగా కూడా మన స్టార్స్ అదరగొట్టేస్తాయి. తెలుగు హీరోల్లో డాన్సింగ్ స్టార్స్ అంటే ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా చెబుతారు. అసలు బ్లాక్ అండ్ వైట్ కాలంలో మన తెలుగు సినిమాకు డాన్స్ లతో ఒక క్రేజ్ తెచ్చారు అక్కినేని నాగేశ్వర రావు. ఆ తర్వాత చిరంజీవి బ్రేక్ డాన్స్ గురించి అందరికీ తెలిసిందే. డాన్స్ తో చిరు నేషనల్ వైడ్ గా షేక్ చేశాడు.

ఈ తరం హీరోల్లో చరణ్, బన్నీ, తారక్ ఈ ముగ్గురు ఎలాంటి సినిమా చేసినా సరే డ్యాన్స్ తో దుమ్ముదులిపేస్తారు. మిగతా హీరోలతో పోల్చితే మా వాళ్లు డ్యాన్స్ లు అదరగొట్టేస్తారని ఫ్యాన్స్ మధ్య వార్ తెలిసిందే. అయితే ఈమధ్య ఏమైందో ఏమో మహేష్ బాబు కూడా డ్యాన్స్ వేయడం మొదలు పెట్టాడు. బ్రహ్మోత్సవం టైం లో తన డ్యాన్స్ ల విషయంలో వచ్చిన ట్రోల్స్ ని సీరియస్ గా తీసుకున్న మహేష్ ఇన్నాళ్లకు ఆ కసి తీర్చుకుంటున్నాడు.

శేఖర్ మాస్టర్ తో కలిసి వరుసగా సినిమాల్లో డ్యాన్స్ నెంబర్స్ వేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు మైండ్ బ్లాక్ నుంచి డాన్సుల్లో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం లో కుర్చీ మడతపెట్టి సాంగ్ లో కూడా డ్యాన్స్ కుమ్మేశాడు మహేష్. ఫ్యాన్స్ కి డాన్స్ లతో కూడా ఫీస్ట్ ఇస్తె ఆ లెక్క ఎలా ఉంటుందో చూపించాడు.

ఇక ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. మహేష్ డాన్స్ లతో అదరగొట్టడం చూసిన ప్రభాస్ తను కూడా ఫ్యాన్స్ కి ఒక మంచి డ్యాన్స్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజా సాబ్ సినిమాలో ఒక డాన్స్ నెంబర్ ని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సాంగ్ లో ప్రభాస్ డ్యాన్స్ ఫ్యాన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు. కత్తి ఎత్తి నరకడమే కాదు డాన్స్ తో కూడా అదరగొట్టేస్తానని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాడు ప్రభాస్. అదే జరిగితే రాజా సాబ్ సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందని చెప్పొచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్ట్రీ నిర్మిస్తున్న రాజా సాబ్ సినిమాలో మలయాళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.


Tags:    
  • Tollywood 
  • Panindia 
  • Rebelstar 
  • Prabhas 
  • Rajasaab 
  • Rajasaabmovie 
  • Dance 
  • Dancenumber 
  • Maruthi 
  • Fans 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS