ది రాజాసాబ్.. ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం రంగంలోకి ప్రముఖ రాపర్!
ఇక ప్రస్తుతం రీ షూట్ లో బిజీగా ఉన్న ప్రభాస్ మూవీకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.;
రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను ప్రకటిస్తూనే.. మరొకవైపు ఇతర హీరోల చిత్రాలలో కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాదు పలు చిత్రాలకు మాట సహాయం కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ప్రభాస్ చేతిలో సుమారుగా 6 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో మొదటిది 'ది రాజా సాబ్'. ప్రముఖ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించగా.. ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ అభిమానులలో పలు అనుమానాలు రేకెత్తించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ బాగోలేదని చాలామంది కామెంట్లు చేశారు. దీంతో కొన్ని సన్నివేశాలను ఇప్పుడు రీ షూట్ కూడా చేయాల్సి వస్తోంది. అందులో భాగంగానే సినిమాని కూడా వచ్చే ఏడాది జనవరి 9కి సంక్రాంతి సందర్భంగా వాయిదా వేయడం జరిగింది.
ఇక ప్రస్తుతం రీ షూట్ లో బిజీగా ఉన్న ప్రభాస్ మూవీకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ కోసం మారుతి ఒక ర్యాపర్ సింగర్ ను రంగంలోకి దింపినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే.. డైరెక్టర్ మారుతి ఈ సినిమాలో వింటేజ్ లుక్ లో ప్రభాస్ ని చూపించబోతున్నానని ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే అంతేకాదు ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ ట్రైలర్ లో కూడా పాత ప్రభాస్ ని చూసి అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేశారు.
అలాంటి ఈ సినిమాలో ప్రభాస్ ను మరింత హైలెట్ చేసేలా చూపించబోయే ఒక ఇంట్రడక్షన్ పాట కోసం కూడా దిగ్గజ రాపర్ ను రంగంలోకి దింపినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ రాపర్ సింగర్ హనుమాన్ కింద్ (సూరజ్ చెరుకట్) చేత ఈ పాట పాడించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు కానీ త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పాటను ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమా విషయానికి వస్తే.. వచ్చే ఏడాది జనవరి 9న బహుళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ ప్రభాస్ కి దాత పాత్రలో కనిపించనున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ జానర్ మూవీ కావడంతో ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాను విడుదల చేయబోతున్నారు. వీటి తరువాత స్పిరిట్ మూవీతో పాటు కల్కి 2 , సలార్ 2 వంటి చిత్రాలను కూడా లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రాల తర్వాత మరో యంగ్ డైరెక్టర్ కి ప్రభాస్ అవకాశం ఇచ్చినట్లు సమాచారం.