ప్రభాస్ నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా.. ఇదెక్కడి ట్విస్ట్!
అందులో భాగంగానే వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రభాస్ .. తాజాగా ఈ సంక్రాంతికి 'ది రాజాసాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.;
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా చలామణి అవుతూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రభాస్ .. తాజాగా ఈ సంక్రాంతికి 'ది రాజాసాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సైకలాజికల్, కామెడీ , హారర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ప్రభాస్ కారణంగానే ఈ సినిమాకు కలెక్షన్లు బాగా వస్తున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
దీనికి తోడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాకు 200 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జరీనా వహాబ్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్లు సొంతం చేసుకుని దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభాస్ గురించి ఒక కీలక విషయాన్ని బయటపెట్టారు డైరెక్టర్ మారుతి. ది రాజాసాబ్ విడుదలైన నాలుగు రోజుల్లోనే 200 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలవడంతో మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో ముచ్చటించారు మారుతి. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.." ఫాంటసీతో కూడిన ది రాజాసాబ్ తరహా సినిమాలు చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాము. ప్రభాస్ వృద్ధిడిగా కనిపిస్తూ.. రివర్స్ లో సాగే సన్నివేశాల కోసం ఎంతగానో కష్టపడ్డాము. అయితే ఆ కష్టాన్ని మాకు మరింత సులభం చేశారు ప్రభాస్. కొన్ని సన్నివేశాలను ఎలా చేద్దామని మేము ప్రభాస్ తో చర్చించగా.. ఆయన ఆలోచించి తన ఆలోచనలు పంచుకుంటూ దర్శకత్వంలో మాకు సహాయం చేశారు. ఈ సినిమాకి కలెక్షన్స్ బాగా వస్తున్నాయి అంటే ప్రభాస్ ను ఒక కొత్త జానర్ లో ప్రేక్షకులు స్వీకరించినట్లే" అంటూ చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ గురించి మారుతి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై ప్రభాస్ అభిమానులు స్పందిస్తూ ప్రభాస్ లో ఒక మంచి డైరెక్టర్ కూడా ఉన్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడూ సైలెంట్ గా కనిపించే ప్రభాస్ లో ఇంత టాలెంట్ ఉందా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ప్రభాస్ కెరియర్..
ప్రభాస్ విషయానికి వస్తే.. తొలిసారి తన కెరీర్లో కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చేశారు. ఈ సినిమా ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో థియేటర్లలో నడుస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఆగస్టులో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా తర్వాత కల్కి 2, సలార్ 2 చిత్రాలు లైన్లో ఉన్నాయి.