స్పిరిట్ గురించి ఫేక్ న్యూస్.. నిజమని నమ్మేస్తున్న నెటిజన్లు
అయితే ఆ పోస్ట్ ను చూసి చాలా మంది ఫ్యాన్స్ అది నిజమేనని భావిస్తూ సంతోషిస్తున్నారు. కానీ అసలు విషయమేంటంటే ఆ పోస్ట్ లో ఏ మాత్రం నిజం లేదు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఓ వైపు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమాను పూర్తి చేస్తూనే మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాను చేస్తున్నారు. ఈ రెండింటిలో రాజా సాబ్ ఆల్మోస్ట్ పూర్తవగా, ఫౌజీ సినిమా 40% పూర్తైనట్టు టాక్ వినిపిస్తోంది. ఈ రెండింటితో పాటూ ప్రభాస్ లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి.
స్పిరిట్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
వాటిలో స్పిరిట్ కూడా ఒకటి. అర్జున్ రెడ్డి, యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న ఈ స్పిరిట్ పై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. యానిమల్ సినిమా తర్వాత నుంచి సందీప్ ఈ ప్రాజెక్టు పైనే వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటూ అందరూ వెయిట్ చేస్తున్నారు.
సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని చెప్పిన వంగా
అయితే గతంలో ఓ సందర్భంలో స్పిరిట్ సినిమా సెప్టెంబర్ నుంచి అఫీషియల్ గా స్టార్ట్ అవుతుందని సందీప్ రెడ్డి వంగా చెప్పిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రకరకాల గాసిప్స్ నెట్టింట వినిపిస్తుండగా రీసెంట్ గా ఓ అనఫీషియల్ X హ్యాండిల్ నుంచి సెప్టెంబర్ 2న స్పిరిట్ గ్రాండ్ గా లాంచ్ కానుందని చెప్తూ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ క్షణాల్లో నెట్టింట వైరలైంది.
సెప్టెంబర్ 2న లాంచ్ కానుందని రూమర్లు
అయితే ఆ పోస్ట్ ను చూసి చాలా మంది ఫ్యాన్స్ అది నిజమేనని భావిస్తూ సంతోషిస్తున్నారు. కానీ అసలు విషయమేంటంటే ఆ పోస్ట్ లో ఏ మాత్రం నిజం లేదు. స్పిరిట్ గురించి ఏదైనా అప్డేట్ వస్తే అది సందీప్ రెడ్డి వంగా నుంచి కానీ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి మాత్రమే వస్తాయని, ఇలాంటివి నమ్మొద్దని పీఆర్ టీమ్ మొదటి నుంచి చెప్తున్నప్పటికీ కొందరు మాత్రం ఆ పోస్టులను గుడ్డిగా నమ్మేస్తున్నారు. టీ- సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై ఓల్టేజ్ డ్రామాలో త్రిప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా హర్షవర్థన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే స్పిరిట్ నుంచి అప్డేట్ వచ్చే ఛాన్సుంది.