యానిమల్ వైబ్స్ లో ప్రభాస్ కటౌట్

ముఖ్యంగా 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ గాయాలతో, రక్తం మరకలతో, చేతిలో మందు బాటిల్ తో కనిపించే సీన్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయో మనకు తెలుసు.;

Update: 2026-01-01 04:34 GMT

న్యూ ఇయర్ వేళ ప్రభాస్ ఫ్యాన్స్ కి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' ఫస్ట్ లుక్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర మరోసారి వైల్డ్ జాతర ఖాయం అనిపిస్తోంది. అయితే ఈ పోస్టర్ చూడగానే సగటు సినిమా లవర్ కి వెంటనే గుర్తొస్తున్న సినిమా 'యానిమల్'. అచ్చం సందీప్ వంగా మార్క్ ఇంటెన్సిటీ, ఆ రా నెస్ ఈ పోస్టర్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభాస్ ని ఒక కొత్త కోణంలో చూపించాడు దర్శకుడు.




 


ముఖ్యంగా 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ గాయాలతో, రక్తం మరకలతో, చేతిలో మందు బాటిల్ తో కనిపించే సీన్స్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయో మనకు తెలుసు. ఇప్పుడు 'స్పిరిట్' లో ప్రభాస్ ని చూస్తుంటే అచ్చం అదే వైబ్ రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తోంది. ప్రభాస్ వీపు నిండా గాయాలు, చేతికి కట్లు, చేతిలో మందు గ్లాస్.. పక్కన హీరోయిన్.. ఇవన్నీ చూస్తుంటే వంగా తన ఫేవరెట్ 'వైలెన్స్' ని ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. ఆజానుబాహుడి ఒంటి నిండా ఆ గాయాలు చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి.

ఇక ఈ పోస్టర్ లో హీరోయిన్ త్రీప్తి డిమ్రి ప్రెజెన్స్ కూడా ఆసక్తికరంగా ఉంది. ప్రభాస్ సిగరెట్ ని ఆమె లైటర్ తో వెలిగిస్తున్న తీరు చూస్తుంటే, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బోల్డ్ గా, వైల్డ్ గా ఉండేలా ఉంది. యానిమల్ లో హీరోయిన్ల పాత్రలను డిజైన్ చేసిన తీరుకు, ఇప్పుడు స్పిరిట్ లో ఈ స్టిల్ కి దగ్గరి పోలికలు ఉన్నాయి. వైట్ అండ్ వైట్ లో ప్రభాస్, వైట్ శారీలో తృప్తి.. ఈ కాంట్రాస్ట్ వెనుక ఏదో బలమైన ఎమోషనల్ డ్రామా దాగి ఉందనిపిస్తోంది.

నిజానికి ఇది ఒక పోలీస్ స్టోరీ అని సందీప్ ఎప్పుడో చెప్పాడు. కానీ ఈ పోస్టర్ లో ప్రభాస్ ని చూస్తుంటే ఒక సిన్సియర్ పోలీస్ లా కాకుండా, సిస్టమ్ ని ఎదిరించే రెబల్ లా, లేదా ఒక గ్యాంగ్ స్టర్ లా కనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్ తో, ఆటిట్యూడ్ చూపిస్తూ నిల్చున్న ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఖాకీ చొక్కా వేయకపోయినా, ఆ కటౌట్ లో ఉన్న పవర్ చూస్తుంటే.. ఇది రెగ్యులర్ పోలీస్ డ్రామా కాదని, వంగా మార్క్ "మాస్ కాప్" సినిమా అని క్లారిటీ వచ్చేసింది.

పైకి 'యానిమల్' ఛాయలు కనిపిస్తున్నా, సందీప్ రెడ్డి వంగాని అంచనా వేయడం అంత సులభం కాదు. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు ప్రతి సినిమాతో ఆడియెన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే వచ్చాడు. కాబట్టి ఈ గాయాల వెనుక, ఆ మందు బాటిల్ వెనుక మనం ఊహించని సరికొత్త కథ ఉండే ఛాన్స్ ఉంది. పోస్టర్ లో కనిపించే సిమిలారిటీస్ కేవలం శాంపిల్ మాత్రమే, థియేటర్లో అసలు విశ్వరూపం వేరేలా ఉండొచ్చు. వంగా టేకింగ్ లో ఉన్న మ్యాజిక్ అదే మరి.

ఏదేమైనా న్యూ ఇయర్ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ దొరికినట్లే. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ లెవెల్ లో ప్రకంపనలు సృష్టించడానికి రెడీ అవుతోంది. యానిమల్ రేంజ్ ఇంటెన్సిటీకి, ప్రభాస్ మార్క్ హీరోయిజం తోడైతే బాక్సాఫీస్ రికార్డులు ఏ రేంజ్ లో బద్దలవుతాయో ఊహించుకుంటేనే కిక్ వస్తోంది. చూడాలి మరి రాబోయే అప్డేట్స్ ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో.

Tags:    

Similar News