స్పిరిట్ క్రేజీ అప్ డేట్ ఏంటంటే?

ఈ సినిమా షూటింగ్ ప్రక్రియ ఇప్పటికే వేగంగా కొనసాగుతోందని.. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను, యాక్షన్ ఘట్టాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్న‌ట్లు తెలిపారు.

Update: 2026-07-20 19:24 GMT

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ - సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా `స్పిరిట్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై అంచ‌నాలు ఏ రేంజ్ లో ఉన్నాయో? చెప్పాల్సిన ప‌నిలేదు. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు? ప్రేక్ష‌కుల ముందుకొస్తుంద‌ని ఆస‌క్తి అంత‌కంత‌కు పెరిగిపోతుంది.ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తయిందని సందీప్ రెడ్డి వంగా వెల్ల‌డించారు. ఈ సినిమా షూటింగ్ ప్రక్రియ ఇప్పటికే వేగంగా కొనసాగుతోందని.. సినిమాలోని కీలకమైన సన్నివేశాలను, యాక్షన్ ఘట్టాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్న‌ట్లు తెలిపారు.

40 శాతం షూటింగ్ పూర్తి కావడం అంటే? నిర్మాణ బృందం పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోందనడానికి నిదర్శనం. ప్రభాస్ లుక్ ..క్యారెక్టరైజేషన్ విషయంలో సందీప్ తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని రోజులుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా సందీప్ సినిమాల్లో హీరోల పాత్రలు చాలా ఇంటెన్స్‌గా, ఎమోషనల్‌గా ఉంటాయి. ప్రభాస్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న నటుడు ఎలాంటి పాత్రలో ఎలా కనిపించబోతున్నాడనేది ఫ్యాన్స్‌లో ఆసక్తిని కలిగిస్తోంది.

ఇప్పటికే పూర్తయిన 40 శాతం షూటింగ్‌లో ప్రభాస్ నటించిన సీన్లు చాలా పవర్‌ఫుల్‌గా వచ్చాయని చిత్ర వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. సాంకేతికపరంగా స్పిరిట్ హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో రూపొందుతోందని తెలుస్తోంది. భారీ సెట్లు, అత్యాధునిక కెమెరా పనితనం , నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. సందీప్ రెడ్డి వంగా ప్రతి సినిమాకు సంగీత దర్శకులతో ప్రత్యేకమైన శబ్దాలను రూపొందిస్తారు. ఈ చిత్రానికి కూడా ఆయన మ్యూజిక్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మిగిలిన భాగం షూటింగ్ కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన నాటి నుంచి ఇండియాలోనే వివిధ లోకేష‌న్ల‌లో జ‌రుగుతోంది.విదేశీ లోకేష‌న్ల వ‌ర‌కూ వెళ్ల‌లేదు. ఈ నేప‌థ్యంలో 60 శాతం షూటింగ్ లో కొంత భాగం విదేశాల్లో జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. సాధార‌ణంగా సందీప్ విదేశీ షూటింగ్ ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌తనివ్వ‌రు. వీలైనంత వ‌ర‌కూ ఇండియాలోనే చుట్టేస్తారు. `అర్జున్ రెడ్డి`, `యానిమ‌ల్` షూటింగ్ లు ఇండియాలోనే జ‌రిగాయి. వాటిలో పాట‌ల‌కు కూడా పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు కాబ‌ట్టి విదేశీ లొకేష‌న్ల అవ‌స‌రం ప‌డ‌లేదు. మ‌రి `స్పిరిట్` విష‌యంలో విదేశీ లొకేష‌న్ల ఛాన్స్ ఎంత వ‌ర‌కూ తీసుకుంటారు? అన్న‌ది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News