• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సలార్ 2 ముందు మరోటా..?

సలార్ 2 ముందు మరోటా..?

| ఐతే ప్రశాంత్ నీల్ తారక్ సినిమా పూర్తి చేసే టైం కి ప్రభాస్ మరో కొత్త సినిమా కమిటైతే మాత్రం ప్రశాంత్ నీల్ సలార్ 2 ని పక్కన పెట్టి తను కూడా వేరే సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది.

By - Tupaki Desk
Update: 2025-05-27 00:45 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ వచ్చి రెండేళ్లు అవుతుంది. సలార్ 1 సీజ్ ఫైర్ అంటూ ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబో సినిమా ఎలా ఉండాలో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా వచ్చింది. ఐతే సలార్ 1 కాదు సలార్ 2 లో అసలు రచ్చ ఉంటుందని తెలుస్తుంది. వరద రాజ మన్నార్ వర్సెస్ దేవల ఫైట్ ఎలా ఉంటుందో సలార్ 2 శౌర్యాంగ పర్వంలో చూడాల్సిందే. ఐతే సలార్ 1 రిలీజ్ చేసే టైం కి సలార్ 2 ని ఏడాదిలో మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ప్రభాస్ వరుస సినిమాల వల్ల అది కుదరలేదు.

సలార్ 1 తర్వాత ప్రభాస్ కల్కి పార్ట్ 1 చేశాడు ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ సినిమాలు పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. రాజా సాబ్ ఈ ఇయర్ రిలీజ్ ఉంటుంది కానీ ఫౌజీ రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. ఇక సలార్ 2 విషయం అయితే లెక్క తేలట్లేదు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఎలా లేదన్నా మరో ఏడాది పైన పట్టేలా ఉంది. సో సలార్ 2 ఇప్పుడప్పుడే జరిగేలా లేదు. ఈలోగా ప్రభాస్ కమిటైన సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఐతే ప్రశాంత్ నీల్ తారక్ సినిమా పూర్తి చేసే టైం కి ప్రభాస్ మరో కొత్త సినిమా కమిటైతే మాత్రం ప్రశాంత్ నీల్ సలార్ 2 ని పక్కన పెట్టి తను కూడా వేరే సినిమా చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎలా లేదన్నా సలార్ 2 కి చిక్కుముడి వీడేలా లేదు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఇద్దరు కలిసి కనీసం ఏడాదిన్నర రెండేళ్లు టైం కేటాయిస్తేనే సలార్ 2 సినిమా పూర్తవుతుంది. ముఖ్యంగా సలార్ 1 లో మిస్సైంది అనిపించిన ఆ కిక్ ని సలార్ 2 తో ఇవ్వాలని ప్రశాంత్ నీల్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా పూర్తి చేసే టైం కి ప్రభాస్ కూడా ఫ్రీ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే సలార్ 2 ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. హోంబలే ప్రొడక్షన్స్ ప్రభాస్ తో 3 సినిమాల అగ్రిమెంట్ చేసుకోగా అందులో సలార్ 2 కూడా ఒకటని తెలిసిందే. ఐతే ప్రభాస్ ఎంత త్వరగా డేట్స్ ఇచ్చి సినిమా పూర్తి చేస్తే అంత మంచిదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Tags:    
  • Prabhas 
  • Salaar2 
  • Salaar 
  • PrashanthNeel 
  • SalaarSequel 
  • TeluguCinema 
  • TollywoodUpdates 
  • RajaSaab 
  • NTRMovie 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS