ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేతిలో ప్ర‌స్తుతం ఒక‌టి కాదు రెండు కాదు, నాలుగైదు సినిమాలున్నాయి.;

Update: 2025-05-15 10:57 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ చేతిలో ప్ర‌స్తుతం ఒక‌టి కాదు రెండు కాదు, నాలుగైదు సినిమాలున్నాయి. వాటిలో ప్ర‌భాస్ నుంచి ఏ సినిమా ముందొస్తుంది? ఏది వెన‌క్కి వెళ్తుంద‌నేది తెలియ‌క ఫ్యాన్స్ ఆయ‌న సినిమా అప్డేట్స్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న కొద్దీ ప్ర‌భాస్ సినిమాల‌కు సంబంధించిన అప్డేట్స్ వెన‌క్కు వెళ్తూ వ‌స్తున్నాయి.

ప్ర‌భాస్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ది రాజా సాబ్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మాళ‌విక మోహ‌న‌న్, నిధి అగ‌ర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమా హార్ర‌ర్ కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంది. వాస్త‌వానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ‌వాల్సింది కానీ ప్ర‌భాస్ కు షూటింగ్ లో అయిన గాయం కార‌ణంగా సినిమా వాయిదా ప‌డింది.

గాయం వ‌ల్ల ప్ర‌భాస్ ను డాక్ట‌ర్లు రెస్ట్ తీసుకోమ‌ని సూచించగా, రెస్ట్ లో భాగంగా ప్ర‌భాస్ ఇట‌లీలో ఉంటున్న విష‌యం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న ప్ర‌భాస్ రీసెంట్ గానే హైద‌రాబాద్ కు వచ్చాడు. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న ది రాజా సాబ్ షూటింగ్ లో ప్ర‌భాస్ పాల్గొన‌నున్న‌ట్టు అత‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెప్తున్నాయి.

రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ కూడా పాల్గొన్నాడు. హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లోని అజీజ్ న‌గ‌ర్ స్టూడియోలో ది రాజా సాబ్ లేటెస్ట్ షెడ్యూల్ జ‌రుగుతుండ‌గా, ఆ షెడ్యూల్ కోసం సంజ‌య్ దత్ హైద‌రాబాద్ కు చేరుకున్నాడు. ఇప్పుడు త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ కూడా ది రాజా సాబ్ సెట్స్ లో పాల్గొన‌నున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

వీలైనంత త్వ‌ర‌గా ది రాజాసాబ్ పెండింగ్ వ‌ర్క్స్ ను పూర్తి చేసి ఈ నెలాఖ‌రు నాటికి సినిమా టీజ‌ర్ ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ చాలా వింటేజ్ లుక్స్ లో క‌నిపిస్తున్నాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News