ప్రభాస్ వర్సెస్ రజనీ.. మళ్లీ బాక్సాఫీస్ క్లాష్
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బీజీగా ఉన్నారు. ఐదు పాన్ఇండియా సినిమాలు లైన్ లో పెట్టారు. అందులో ముందుగా రాజాసాబ్ విడుదల కానుంది.;
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బీజీగా ఉన్నారు. ఐదు పాన్ఇండియా సినిమాలు లైన్ లో పెట్టారు. అందులో ముందుగా రాజాసాబ్ విడుదల కానుంది. ఈ చిత్రం జనవరి 09న రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిత తర్వాత హను రాఘవపూడితో ఆయన ఫౌజీ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పిటికే ప్రారంభమమైంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ప్రభాస్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమా పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతుంది. ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ ను ఇప్పటిదాకా డార్లింగ్ గా చూసిన అభిమానులు ఇందులో వారియర్ గా చూడనున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
అయితే హను రాఘవపూడి ఇదివరకు తెరక్కించిన సీతారామం మంచి సక్సెస్ అందుకుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో కూడా ప్రభాస్ కు ఓ అందమైన ప్రేమ కథతో పాటు వారియర్ గా చూపించనుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోవాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే బ్యాలెన్స్ పనులన్నీ పూర్తి చేసి 2026 ఆగస్టు 13న థియేటర్లలోకి వచ్చేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇండిపెండెన్స్ వీకెండ్ ను వాడుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇలాంటి పెద్ద సినిమా సోలోగా రావాలని అనుకుంటారు ఎవరైనా. కానీ, ఇక్కడే చిక్కు వచ్చి పడింది. అదే ఆగస్టు 13ను రజనీకాంత్ జైలర్ 2 వాడుకోవాలని చూస్తోంది.
అటు కోలీవుడ్ లో రజనీ బడా స్టార్. ఆయనకు బాక్సాఫీస్ క్లాష్ లు కొత్తేం కాదు. కానీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి పార్ట్ బ్లాస్ బస్టర్ అయినందున సీక్వెల్ పై హైప్ ఉంది. అయితే రీసెంట్ గా రజనీ .. వార్ 2తో పోటీకి వచ్చారు. ఈ రేస్ లో రజనీ నెగ్గినప్పటికీ.. అనుకున్నంత కలెక్షన్ రాలేదన్నది నిజం. అందుకే ఎవరైనా సోలో రిలీజ్ చూసుకుంటే బెటర్. ఇంకా టైమ్ ఉంది కాబట్టి చూద్దాం. ఎవరైనా తగ్గుతారు ఏమో