రాజా సాబ్ ప్రమోషన్స్ షురూ..!
రాజా సాబ్ సినిమా టీజర్ ని ఈ నెల 16న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే సినిమా టీజర్ రిలీజ్ ని కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు.;
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. సినిమా నుంచి కొన్నాళ్లుగా అప్డేట్స్ లేవని ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉండగా ఫైనల్ గా సినిమా రిలీజ్ డేట్ తో పాటు టీజర్ రిలీజ్ ని ప్రకటించారు. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
రాజా సాబ్ సినిమా టీజర్ ని ఈ నెల 16న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఐతే సినిమా టీజర్ రిలీజ్ ని కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. హైదరాబాద్ పోసెట్టిగూడ ఎయిర్ పోర్ట్ దారిలో ప్రభాస్ రాజా సాబ్ హోర్డింగ్ పోస్టర్ కనిపించింది. ఎయిర్ పోర్ట్ వెళ్తూ వస్తున్న వాళ్లకు ఆ బ్యానర్ ఎట్రాక్ట్ చేస్తుంది. రాజా సాబ్ సినిమాను వీలైంత భారీగా ప్రమోట్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.
రాజా సాబ్ సినిమాను మారుతి పకడ్బందీ ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ పై ప్రభాస్ మాస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేస్తుందని అంటున్నారు. థ్రిల్లర్ జోనర్ లో సరికొత్త కథ కథాంశంతో రాజా సాబ్ వస్తుంది. ఈ సినిమా విషయంలో ఇన్నాళ్లు ఫ్యాన్స్ చేసిన వెయిటింగ్ కి పర్ఫెక్ట్ ఫీస్ట్ ఇస్తుందని అంటున్నారు.
ప్రభాస్ రాజా సాబ్ టీజర్ సోమవారం రిలీజ్ కాబోతుంది. ఈ టీజర్ తోనే సినిమాపై మరింత అంచనాలు పెంచేలా చేస్తున్నారు. రాజా సాబ్ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ లాక్ చేశారు. ప్రభాస్ సినిమా రిలీజ్ అంటే పాన్ ఇండియా లెవెల్ లో భారీ హైప్ వస్తుంది. అందుకు తగినట్టుగానే సినిమా వసూళ్లు మోత మోగిస్తుంది. రాజా సాబ్ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది.. మళ్లీ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందిస్తాడా అన్నది చూడాలి.
సలార్ 1, కల్కి 2898 AD సినిమాలతో ప్రభాస్ అదరగొట్టగా ఆ సినిమాల హిట్ మేనియా కొనసాగించేలా రాజా సాబ్ రాబోతుంది. ఈ సినిమాను హిందీ లో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు వరల్డ్ వైడ్ గా ప్రభాస్ రాజా సాబ్ హైయెస్ట్ థియేటర్ లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.