నార్త్ ఇండియాలో తడబడ్డ రాజా సాబ్.. గత సినిమాలతో పోలిస్తే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉంటాయి.;

Update: 2026-01-10 11:00 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి సినిమా వస్తుందంటే బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉంటాయి. బాహుబలి సిరీస్ తర్వాత అక్కడ ప్రభాస్ కు ఒక సెపరేట్ మార్కెట్ క్రియేట్ అయింది. కానీ లేటెస్ట్ గా విడుదలైన 'ది రాజా సాబ్' మాత్రం హిందీ బెల్ట్ లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదలైనప్పటికీ, నార్త్ ఇండియాలో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ డల్ గానే వచ్చాయి. అక్కడి ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు ఈ సినిమా కేవలం 5.5 నుంచి 6 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ గత చిత్రాల ట్రాక్ రికార్డ్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పాలి. బాహుబలి తర్వాత ఆయన నటించిన సినిమాలన్నీ దాదాపు 20 కోట్లకు పైగా నెట్ ఓపెనింగ్స్ సాధించాయి. సాహో సినిమా మొదటి రోజే హిందీలో సుమారు 24 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ స్థాయి క్రేజ్ ఉన్న ప్రభాస్ సినిమాకు ఇప్పుడు సింగిల్ డిజిట్ ఓపెనింగ్స్ రావడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాజా సాబ్ కంటే తక్కువ ఓపెనింగ్స్ సాధించిన ప్రభాస్ సినిమా అంటే అది కేవలం రాధే శ్యామ్ మాత్రమే. ఆ చిత్రం మొదటి రోజు అంచనాల ప్రకారం హిందీలో దాదాపు 4 నుంచి 5 కోట్ల మధ్య నెట్ అందుకుంది. మళ్ళీ ఇప్పుడు దాదాపు అదే స్థాయి వసూళ్లు రాజా సాబ్ కి వచ్చాయి. హిందీ ఆడియన్స్ లో రాజాసాబ్ సినిమాపై పెద్దగా అవగాహన లేకపోవడం, ప్రమోషన్లు కూడా నామమాత్రంగానే ఉండటం వల్లే ఇంత తక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

దీనికి తోడు సినిమాకు మిక్స్డ్ టాక్ రావడం, మౌత్ టాక్ కూడా వీక్ గా ఉండటంతో నార్త్ లో రాజా సాబ్ మరింత స్లో అయ్యింది. సలార్ సినిమా కూడా హిందీలో దాదాపు 15 కోట్లకు పైగా నెట్ వసూలు చేయగా, కల్కి 2898 AD సుమారు 22 కోట్ల నెట్ కలెక్షన్లతో అదరగొట్టింది. ఆ సినిమాలతో పోలిస్తే రాజా సాబ్ వసూళ్లు చాలా తక్కువ.

రాబోయే వీకెండ్ లో ఈ సినిమా హిందీలో పుంజుకోవడం అంత ఈజి కాదు. సౌత్ లో ప్రభాస్ కు ఉన్న క్రేజ్ వల్ల వంద కోట్ల మార్కును దాటినప్పటికీ, హిందీ మార్కెట్ లో మాత్రం సినిమా ఊహించని షాక్ ఇచ్చింది. హారర్ కామెడీ జోనర్ అక్కడి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదా లేక సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం వల్ల జనాలు థియేటర్లకు రాలేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అంచనాల ప్రకారం ప్రభాస్ హిందీ ఓపెనింగ్స్ లెక్కలు ఒకసారి గమనిస్తే..

సాహో: రూ. 24 కోట్లు

రాధే శ్యామ్: రూ. 4-5 కోట్లు

ఆదిపురుష్: రూ. 37-40 కోట్లు

సలార్: రూ. 15 కోట్లు

కల్కి 2898 AD: రూ. 22 కోట్లు

ది రాజా సాబ్: రూ. 5.5-6 కోట్లు

Tags:    

Similar News