ప్రభాస్ 'రాజా సాబ్'.. 4 రోజుల లెక్క ఎలా ఉందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2026-01-13 09:38 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా... సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ అయింది. భారీ అంచనాలతో విడుదలైన మూవీ.. అనుకున్న స్థాయిలో వాటిని అందుకోలేకపోయిందని చెప్పాలి. ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వచ్చింది.




 


అయితే మిక్స్ డ్ టాక్ తో వెళ్తున్న రాజా సాబ్ మూవీ రిలీజ్ అయ్యి అప్పుడే నాలుగు రోజులు కంప్లీట్ అయిపోయింది. దీంతో మేకర్స్ తాజాగా వసూళ్ల వివరాలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. నాలుగు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 201 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిందని మంగళవారం వెల్లడించారు. స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

అందులో ప్రభాస్ వైట్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో కనిపిస్తుండగా.. పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. సూపర్ లుక్ అంటూ సినీ ప్రియులు, నెటిజన్లు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే తొలి రోజు రూ.112 కోట్లు (ప్రీమియర్స్తో కలిపి) వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. హారర్ ఫాంటసీ ఫిల్మ్ కు ఇంత భారీ రేంజ్లో ఓపెనింగ్స్ దక్కడం ఇదే తొలిసారి అని ఆ సమయంలో పేర్కొన్నారు.

అయితే రాజా సాబ్ కు నటీనటుల రెమ్యునరేషన్, టెక్నీషియన్ల ఖర్చు, భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్, ప్రమోషన్ వ్యయాలతో కలిపి బడ్జెట్ సుమారు రూ.400 కోట్లుగా ట్రేడ్ వర్గాలు ఇప్పటికే అంచనా వేశాయి. థియేట్రికల్ బిజినెస్ లో ఆంధ్రా- నైజాం రైట్స్‌ కు రూ.120 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీ రైట్స్‌ కు రూ.30 కోట్లు, తమిళానికి రూ.8 కోట్లు, కర్ణాటకకు రూ.15 కోట్లు, కేరళకు రూ.4 కోట్లు చొప్పున డీల్స్ క్లోజ్ అయ్యాయట.

అదే సమయంలో ఓవర్సీస్ రైట్స్ కు గాను సుమారు రూ.80 కోట్ల బిజినెస్ జరిగిందని వినికిడి. మొత్తం మీద సినిమాకు రూ.250 కోట్లకు పైగా ఓవరాల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి. దీంతో సినిమా సేఫ్ జోన్ లోకి రావాలంటే రూ.500 కోట్లు వసూలు చేయాలని తెలుస్తోంది. ఇది అధికారిక కాకపోయినా.. ట్రేడ్ వర్గాలు రిలీజ్ కు ముందు ఆ విధంగా అంచనా వేశాయి.

ఇక సినిమా విషయానికొస్తే.. మారుతి దర్శకత్వం వహించిన రాజా సాబ్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్ల పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మించారు. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. బొమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, వీటీవీ గణేష్, సత్య, ప్రభాస్ శ్రీను, యోగిబాబు, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. తమన్ మ్యూజిక్ అందించారు.

Tags:    

Similar News