డార్లింగ్ మారాలంటోన్న ఫ్యాన్స్!
ప్రభాస్ తన స్టార్ డమ్ ను తాను సీరియస్ గా తీసుకోకపోయినా అభిమానులు మాత్రం సీరియస్ గానే తీసుకుంటారని సూచించారు.;
టాలీవుడ్ లో పాన్ ఇండియా స్పెషలిస్ట్ డైరెక్టర్లు అంటూ కొంత మంది ఉన్నారు. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్, చందు మొండేటి, ప్రశాంత్ వర్మ, హను రాఘవపూడి పేర్లు ఇండియావైడ్ వినిపిస్తాయి. వాళ్లు తీసిన చిత్రాలే ఆ రేంజ్ లో గుర్తింపును తెచ్చి పెట్టాయి. వీళ్లు గాక త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి, పూరి జగన్నాధ్, బుచ్చిబాబు సహా మరికొంత మంది ఉన్నారు. కానీ వీరు ఇంకా పాన్ ఇండియాలో సినిమాలు చేసి ప్రూవ్ చేసుకోలేదు. ఆ రకమైన ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకా ఫాంలో ఉన్న యంగ్ డైరెక్టర్లు, ఇన్నో వేటివ్ గా స్టోరీలు రాయగల మేకర్స్ మరికొంత మంది ఉన్నారు. వీళ్లతో ఓ స్టార్ హీరో పాన్ ఇండియా సినిమా ప్రకటిస్తే? నెగివిటీకి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది.
తామెంత ప్రతిభావంతులన్నది గత సినిమాలో ప్రూవ్ చేసుకున్న దర్శకుల కాబట్టి అభిమానులు కూడా ఆందోళన చెందరు. తమ అభిమాన స్టార్ ధైర్యంగా వాళ్లతో ముందుకెళ్లొచ్చు అని భావిస్తారు. డార్లింగ్ ప్రభాస్ తెలుసుకోవాల్సింది ఇదేనంటూ తాజాగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన `ది రాజాసాబ్` పాన్ ఇండియాలో డిజాస్టర్ అయిన నేపథ్యంలోనే ప్రభాస్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వం వహించిన సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మంచి ఓపెనింగ్స్ సాధించినా డిజాస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ లో తేలిపోయిన చిత్రంగా మిగిలిపోయింది.
ప్రభాస్ తన స్టార్ డమ్ ను తాను సీరియస్ గా తీసుకోకపోయినా అభిమానులు మాత్రం సీరియస్ గానే తీసుకుంటారని సూచించారు. సింపుల్ సిటీ అనేది ప్రభాస్ వినమ్రతను చాటుతోన్నా? వృత్తిపరంగా ఇది ఆయనపై ప్రభావం చూపుతోందని పలువురు భావిస్తున్నారు. ఆయనలోని ఈ రిలాక్స్‌డ్ ధోరణిని అభిమానులు సైతం ప్రశ్నిస్తున్నారు. ప్రభాస్ తీసుకుంటోన్న నిర్ణయాలే ఆయన సినిమాల నాణ్యతను దెబ్బతీస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. సీనియర్ డైరెక్టర్లు, అగ్రశ్రేణి దర్శకులుతో పని చేయాల్సింది పోయి నాన్-మెయిన్‌స్ట్రీమ్ దర్శకులతోనే ప్రయోగాలు చేస్తున్నారన్న అసంతృప్తి అభిమానుల మాటల్లో కనిపిస్తోంది.
ప్రయోగాలు మంచిదే అయినా? అది ఆయన స్థాయికి తగ్గ రిస్క్ అయి ఉండాలని భావిస్తున్నారు. పాన్ ఇండియాలో సినిమా చేసామంటే? అందుకు బలమైన దర్శకుడు... స్టార్ హీరో కలిస్తేనే సాద్యమవుతుందని అభిప్రాయ పడుతున్నారు. కేవలం హీరో ఇమేజ్ మీద ఆధారపడి సినిమా చేయడం అన్నది పెద్ద తప్పిదంగా భావిస్తున్నారు. మెయిన్‌స్ట్రీమ్ దర్శకులతో పని చేసినప్పుడే నాణ్యమైన అవుట్‌పుట్ వస్తుందని సూచించారు. పాన్ ఇండియాలోఓ సినిమా ఫెయిలైందంటే? అక్కడ నష్టం దర్శకుడి కంటే హీరోకే ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.