అట్లీ మూవీలో బన్నీ బాడీ డబుల్ తనేనా?
తాజా సమాచారం ప్రకారం వీరిద్దరు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. రమ్యకృష్ణ, యోగిబాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప 2`తో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని పాన్ ఇండియా స్టార్‌ల జాబితాలో చేరిపోయాడు. దీని తరువాత వచ్చిన పాపులారిటీకి తగ్గట్టుగా క్రేజీ ప్రాజెక్ట్‌లని ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ పాన్ వరల్డ్ మూవీకి ఇటీవలే శ్రీకారం చుట్టాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ చిత్రాల నిర్మాత కళానిధి మారన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇటీవలే దీని షూటింగ్ మొదలైంది. హాలీవుడ్ స్థాయి సూపర్ హీరో మూవీగా దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
ఇందులో బన్నీకి జోడీగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తోంది. తనతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా కీలక పాత్రలో మరో హీరోయిన్‌గా కనిపించబోతోంది. ఫస్ట్ షెడ్యూల్ని ముంబాయిలోని ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేశారు. ఈ షెడ్యూల్‌లో బన్నీతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా పాల్గోంటోందట. ఆ తరువాతే లొకేషన్‌లోకి దీపికా పదుకోన్ ఎంటరవుతుందని తెలుస్తోంది. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా. సూపర్ హీరో స్టోరీగా దీన్ని అట్లీ తెరపైకి తీసుకొస్తున్నాడు. హాలీవుడ్ తరహా స్టంట్స్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట.
రూ.800 కోట్ల నుంచి దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో అత్యంత భారీ స్థాయలో ఈ మూవీని అట్లీ తెరపైకి తీసుకొస్తున్నాడని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో దీపకా పదుకోన్ తో పాటు మృణాల్ ఠాకూర్ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో ఇద్దరు క్రేజీ హీరోయిన్‌లు కూడా ఇందులో నటించే అవకాశం ఉందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కూడా ఇందులో బన్నీకి జోడీగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం వీరిద్దరు కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. రమ్యకృష్ణ, యోగిబాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ సూపర్ హీరోగా కనిపిస్తాడని, ఇందు కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్‌లని ప్లాన్ చేశారట. అయితే వాటిని తెరకెక్కించేందుకు హాలీవుడ్ టెక్నీషియన్‌లని అట్లీ రంగంలోకి దించేస్తున్న విషయం తెలిసిందే. బన్నీ ఇందులో క్యారెక్టర్ మూడు కోణాల్లో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ చిత్రాల తరహా యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండనున్నాయి. అయితే ఆ సన్నివేశాల చిత్రీకరణ కోసం అల్లు అర్జున్‌కు సంబంధించి బాడీ డబుల్‌ని వాడుతున్నారట.
ఇందు కోసం హాలీవుడ్‌లో పలు సినిమాలకు స్టంట్ యాక్టర్‌గా, బాడీ డబుల్‌గా వర్క్ చేసిన నాథన్ పీపుల్ అనే స్టంట్ యాక్టర్‌ని రంగంలోకి దించుతున్నట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఇందులో యోగిబాబుపై కూడా పలు యాక్షన్ సన్నివేశాలని షూట్ చేసే ఆలోచనలో ఉన్నారట. తన కోసం కూడా కాలిఫోర్నియాకు చెందిన స్టంట్ యాక్టర్ నారాయణ్ కాబ్రల్‌ని తీసుకున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తూ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ మూవీకి అమెరికన్ విజువల్ ఎఫెక్ట్స్ కంపనీ లోలా విజువల్ ఎఫెక్ట్స్ కంపనీ వర్క్ చేస్తోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.