సాయిప‌ల్ల‌వి పై అమీర్ ఖాన్ ప్ర‌త్యేక‌ దృష్టి

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అమీర్ ఖాన్ త‌న కుమారుడి సినిమా విజ‌యంపై న‌మ్మ‌కం వ్య‌క్తం చేసారు. ఆమిర్ ఖాన్ ఈ సినిమాను తాను ఎంతో ఇష్టపడే `ముషీ రొమాన్స్` కేటగిరీకి చెందిన చిత్రంగా అభివర్ణించారు.;

Update: 2026-01-21 03:33 GMT

డ్యాన్స‌ర్ గా, కొరియోగ్రాఫ‌ర్ గా కెరీర్ ప్రారంభించిన సాయిప‌ల్ల‌వి ఇప్పుడు భార‌త‌దేశ‌పు ఐకాన్ స్టార్ గా ఎదిగిన తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అద్భుత‌ న‌టిగా, పాన్ ఇండియ‌న్ స్టార్ గా సాయిప‌ల్ల‌వి నిరూపిస్తోంది. టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ స‌హా హిందీ చిత్ర‌సీమలో ఇప్పుడు సాయిప‌ల్ల‌వి ప్ర‌తిభ గురించిన చ‌ర్చ సాగుతోంది. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ అమీర్ ఖాన్ అంత‌టి వాడే సాయిప‌ల్ల‌విపై ప్ర‌శంస‌లు కురిపించారంటే అర్థం చేసుకోవాలి.

అంత పెద్ద స్థాయికి ఎదిగిన ప్ర‌తిభావంతురాలు సాయిప‌ల్ల‌విని చూసి ద‌క్షిణాది గ‌ర్వించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. మొద‌టి సినిమా `ప్రేమ‌మ్`తోనే నిరూపించిన సాయిప‌ల్ల‌వి నేడు మోస్ట్ వాంటెడ్ స్టార్ల‌లో ఒక‌రిగా ఎదిగిన తీరు ఆస‌క్తిని క‌లిగిస్తుంది. భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌ల్లోని అగ్ర హీరోల స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టించే అవ‌కాశం అందుకుంటోంది. అక్క‌డ ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి పెద్ద హీరో స‌ర‌స‌న రామాయ‌ణం లాంటి క్రేజీ పాన్ ఇండియ‌న్ సినిమాలో న‌టిస్తోంది. ఈ చిత్రానికి నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌రోవైపు అమీర్ ఖాన్ నిర్మాత‌గా, అత‌డి కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా రూపొందుతున్న `ఏక్ దిన్` అనే ప్రేమ‌క‌థా చిత్రంలోను సాయిప‌ల్ల‌వి న‌టిస్తోంది.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అమీర్ ఖాన్ త‌న కుమారుడి సినిమా విజ‌యంపై న‌మ్మ‌కం వ్య‌క్తం చేసారు. ఆమిర్ ఖాన్ ఈ సినిమాను తాను ఎంతో ఇష్టపడే `ముషీ రొమాన్స్` కేటగిరీకి చెందిన చిత్రంగా అభివర్ణించారు.

ఇది ఒక స్వచ్ఛమైన రొమాంటిక్ ఫిల్మ్. చాలా క్లాసిక్ రొమాన్స్ జానర్. ప్రేక్షకుడిగా నాకు భావోద్వేగాలతో కూడిన ప్రేమకథలంటే పిచ్చి. ఇది అచ్చం అలాంటి మ్యాజికల్ లవ్ స్టోరీ.. అని తెలిపారు. ఈ కథను మొదటిసారి విన్నప్పుడే తాను దానికి ఫిదా అయ్యానని, అందుకే తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నానని తెలిపారు.

ఈ సినిమాతో హిందీలో అరంగేట్రం చేస్తున్న సాయి పల్లవిని ఆమిర్ ఆకాశానికెత్తారు. మేం సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. తను అద్భుతమైన నటి.. ఈ సినిమాలో తన నటనతో ప్రాణం పోసింది! అని కొనియాడారు. తన కుమారుడు జునైద్ గురించి మాట్లాడుతూ.. జునైద్ కూడా చాలా బాగా నటించాడు. అతను నా కొడుకు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకూడదు.. కానీ ఇద్దరూ కలిసి తెరపై మ్యాజిక్ చేశారు! అని చెప్పారు.

`ఏక్ దిన్` చిత్రం 2016 నాటి పాపుల‌ర్ థాయ్ చిత్రం `వన్ డే`కి అధికారిక రీమేక్ అని సమాచారం. ఈ సినిమా 1 మే 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టీజర్‌లో చూపించినట్లుగా జపాన్ వంటి మంచు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. జునైద్ - సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఒక ఫీల్ గుడ్ అనుభూతిని ఇస్తుందని టీజర్ స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News