ప్రభాస్ పై దత్ గారి నమ్మకం నిలబడుతుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలపై ఫోకస్ చేయడంతో చాలా బిజీగా ఉన్నారు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ సినిమాలపై ఫోకస్ చేయడంతో చాలా బిజీగా ఉన్నారు. ఆ కారణంతోనే తాను కమిట్ అయిన సీక్వెల్స్ కల్కి2, సలార్2 ను పక్కన పెట్టారని గత కొన్నాళ్లుగా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తన పెండింగ్ సినిమాలన్నింటినీ పూర్తి చేయడానికి ఎంత లేదన్నా సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ టైమ్ పట్టొచ్చు.
అందుకే ప్రభాస్ సలార్2, కల్కి2 రెండింటిపై ఫోకస్ చేసే టైమ్ ఉండటం లేదని అంటున్నారు. కానీ కల్కి నిర్మాత అశ్వినీదత్ మాత్రం కల్కి సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్లి షూటింగ్ ను మొదలుపెట్టడానికి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. అందులో భాగంగానే కల్కి2 ఎట్టి పరిస్థితుల్లో 2026 కంటే ముందే సెట్స్ పైకి వెళ్తుందని, 2025 ఆఖరి మూడు నెలల్లో కల్కి2 మొదలయ్యే అవకాశముందని తెలిపారు.
త్వరలోనే కల్కి2 కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలుపెట్టి, వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ రెడీగా ఉందని అశ్వినీదత్ చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాను 2027లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ 2026లో రిలీజ్ కానుంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య ప్రభాస్ కల్కి2 కోసం ఈ ఇయర్ లోనే డేట్స్ కేటాయించగలరా అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి. కానీ అశ్వినీదత్ మాత్రం ప్రభాస్ పై నమ్మకంతో చాలా కాన్ఫిడెంట్ గా ఈ త్వరలోనే కల్కి2ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు చెప్తున్నారు.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా పురాణాల ఆధారంగా తెరకెక్కి ఆడియన్స్ కు ఓ మంచి ఎక్స్‌పీరియెన్స్ ను అందించింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కీలక పాత్రలో నటించి మెప్పించగా, కమల్ హాసన్ యాస్కిన్ సుప్రీమ్ అనే పాత్రలో విలన్ గా అదరగొట్టారు. దీపికా పదుకొణె టాలీవుడ్ డెబ్యూ చేసిన ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.