• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజ్ సాబ్.. ఆ హీరో వాడిన...

రాజ్ సాబ్.. ఆ హీరో వాడిన షర్టు ప్రభాస్ కోసం..

| డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-11-02 07:03 GMT

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో హర్రర్ కామెడీ జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రభాస్ కి సంబందించిన లుక్స్ ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకున్నాయి. డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడని అర్ధమవుతోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రీసెంట్ గా ప్రభాస్ స్టిల్ ఒకటి వచ్చింది. అందులో ఎల్లో, బ్లూ కలర్ కాంబినేషన్ లో చెక్స్ ఉన్న షర్టు వేసుకొని ప్రభాస్ స్టైలిష్ లుక్ లో కనిపించాడు. అయితే అలాంటి షర్టు విశ్వం సినిమాలో గోపీచంద్ కూడా వేసాడు. ఈ రెండు ఒకే తరహాలో ఉండటంతో బడ్జెట్ తగ్గించుకోవడానికి ఇలా ఇద్దరి హీరోలకి ఒకే షర్టు వాడేశారని సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్, గోపీచంద్ వేసుకున్న షర్ట్స్ లో ఒక్క జేబు తప్ప ఇంకేమీ తేడా లేదు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. విశ్వం సినిమా కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలోనే తెరకెక్కింది. ఒకే ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలు తెరకెక్కినపుడు కాస్ట్యూమ్స్ ని కామన్ గా ఉపయోగించడం అన్ని సినిమాలలో జరుగుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

గోపీచంద్, ప్రభాస్ ఇంచుమించు ఒకే పర్సనాలిటీతో ఉంటారు. అలాగే కాస్ట్యూమ్స్ ఎంపిక అనేది పూర్తిగా డైరెక్టర్ ఛాయస్. అందులో నిర్మాత ప్రమేయం ఉండదు. గోపీచంద్, ప్రభాస్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి సరదాగా గోపీచంద్ వేసుకున్న షర్ట్ ని ప్రభాస్ వేసుకొని ఉండొచ్చని అనుకుంటున్నారు. అయితే ప్రభాస్, గోపీచంద్ ఫోటోలని పక్కపక్కనే పెట్టి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

రెండు చోట్ల ఆ ఒకే షర్ట్ వాడటం పెద్ద ఇష్యూ ఏమీ కాదని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. దీనిపై మరీ టూమచ్ గా ట్రోలింగ్ చేయడాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియాలో తెరకెక్కిన ‘విశ్వం’ మూవీ తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ షర్టుని గోపీచంద్ వేసుకున్న చొక్కాతో పోల్చి చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ది రాజాసాబ్’ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

Tags:    
  • Prabhas 
  • Rajasaab 
  • Maruti 
  • Tollywood 
  • Gopichand 
  • Viswam 
  • Sreenuvaitla 
  • Filmindustry 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS