మాలీవుడ్ డైరెక్టర్ కి ప్రభాస్ ని సెట్ చేస్తున్నారా?
యాక్షన్ .. మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన కథలను తెరకెక్కించడంలో మంచి పట్టు ఉంది. ఆయన రాసిన తాజా మాస్ స్క్రిప్ట్ అత్యంత శక్తివంతంగా ఉండటంతో?
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నా? తదుపరి ప్రాజెక్టుల గురించి వచ్చే వార్తలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో మాలీవుడ్ దర్శకుడు హనీఫ్ అదెని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోందనే వార్త ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏడాదిన్నర క్రితమే దిల్ రాజు హనీఫ్ ను ఒక ప్రాజెక్ట్ కోసం లాక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ స్క్రిప్ట్ చర్చల్లో ప్రభాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దర్శకుడు హనీఫ్ అదెని మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
యాక్షన్ .. మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన కథలను తెరకెక్కించడంలో మంచి పట్టు ఉంది. ఆయన రాసిన తాజా మాస్ స్క్రిప్ట్ అత్యంత శక్తివంతంగా ఉండటంతో? ఆ కథకు ప్రభాస్ అయితేనే సరైన న్యాయం చేయగలరని చిత్ర భావి స్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ .. యాక్షన్ హంగులు అవసరమైన కథకు ప్రభాస్ ఇమేజ్ తోడైతే? అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందని దిల్ రాజు బృందం యోచిస్తోందిట. ప్రభాస్ కెరీర్ గమనిస్తే...వైవిధ్యమైన కథలను ఎంచుకోవడానికి డార్లింగ్ ఎప్పుడూ ముందుంటారు. ఈనేపథ్యంలో హనీఫ్ అదెని స్క్రిప్ట్ పట్ల కూడా సుముఖంగా ఉన్నారా లేదా అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
దిల్ రాజు బ్యానర్ లో ప్రతిష్టాత్మక సినిమాలను నిర్మించడంలో దిట్ట. కాబట్టి ఈ కాంబినేషన్ సెట్ అయితే భారీ ప్రాజెక్ట్ కావడానికి అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే ప్రభాస్ - హనీఫ్ అదెని క్రేజీ కలయికగా నిలుస్తుంది. హనీఫ్ అదెని శైలిలో ఉండే మాస్ అంశాలకు ప్రభాస్ తనదైన శైలి యాక్షన్‌ను జోడిస్తే? థియేటర్లలో ప్రేక్షకులకు పండగే. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య చర్చలు ప్రాధమికంగా జరిగినట్లు తెలుస్తోంది. డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా? సినిమా పట్టాలెక్కడానికి మాత్రం సమయం పడుతుంది.
ప్రస్తుతం ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నారో? చెప్పాల్సిన పనిలేదు. వరుసగా మూడు సినిమా షూటింగ్ లను ఏక కాలంలో పూర్తి చేస్తున్నారు. `స్పిరిట్`, `కల్కి 2`, `ఫౌజీ` షూటింగ్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ముందుగా ఈ మూడు చిత్రాల్లో `ఫౌజీ` రిలీజ్ అవుతుంది. అనంతరం `స్పిరిట్` ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలు డిలే అవ్వడానికి ఎంత మాత్రం వీలు లేదు. అటుపై `కల్కి 2` కూడా అంతే వేగంగా రిలీజ్ అవ్వాలి. ఆ సినిమా షూటింగ్ కి ప్రభాస్ అదనంగా డేట్లు కేటాయించాల్సి ఉంది. ఇవన్నీ చూసుకుని రాజు గారు సినిమాకు డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్ట్ పై పూర్తి క్లారిటీ రావడానికి మరింత సమయం పడుతుంది.