యాంటీ హీరోగా డార్లింగ్?

రీసెంట్ గా మంచు విష్ణు న‌టించిన క‌న్న‌ప్ప సినిమాలో రుద్ర‌గా న‌టించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు ప్ర‌భాస్. అయితే ఇప్పుడు ప్ర‌భాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.;

Update: 2025-07-11 11:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కు ఉన్న మార్కెట్, ఫాలోయింగ్ మామూలుది కాదు. త‌న క్రేజ్ తో వ‌ర‌ల్డ్ వైడ్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా మంచు విష్ణు న‌టించిన క‌న్న‌ప్ప సినిమాలో రుద్ర‌గా న‌టించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు ప్ర‌భాస్. అయితే ఇప్పుడు ప్ర‌భాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

వెండితెర‌పై మాస్ లుక్స్ తో లేదంటే డీసెంట్ లుక్స్ లో క‌నిపించే ప్ర‌భాస్ ఈ సారి యాంటీ హీరోగా క‌నిపిస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామ‌నుకుంటున్నార‌ట‌. బాహుబ‌లి పాత్ర‌లో న‌టించి దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌ను ఆక‌ట్టుకున్న ప్ర‌భాస్ ఈసారి విల‌న్ గా కనిపించి అదే రేంజ్ లో ఆక‌ట్టుకోవాల‌ని చూస్తున్నార‌ట. ఆల్రెడీ స‌లార్ లో ప్ర‌భాస్ ను గ్రే షేడ్ లో చూశాం.

స‌లార్ మూవీలో ప్ర‌భాస్ లుక్స్ నుంచి యాక్టింగ్ వ‌ర‌కు అన్నీ ఆడియ‌న్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాయి. ఆ సినిమా ఇచ్చిన కాన్పిడెన్స్ తోనే ప్ర‌భాస్ ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి పూర్తి స్థాయి యాంటీ హీరోగా ఓ ప్రాజెక్టు చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ప్ర‌భాస్ ఓ బాలీవుడ్ డైరెక్ట‌ర్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని అంటున్నారు.

ఆ బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు కానీ అత‌ను చెప్పిన క‌థ ప్ర‌భాస్ కు చాలా బాగా న‌చ్చ‌డంతో కేవ‌లం ఒక్క సిట్టింగ్ లోనే ప్రాజెక్టును ఓకే చేశార‌ని అంటున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ పూర్తిగా మాస్ లుక్ లో యాంటీ హీరోగా క‌నిపించ‌నున్నార‌ని, ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న కెరీర్లో చేయ‌ని పాత్ర‌లో ఈ మూవీ లో క‌నిపిస్తార‌ని చెప్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ సంస్థ దీన్ని నిర్మించ‌నుంద‌ని అంటున్నారు. ఈ వార్త‌ల్లో నిజ‌మెంతన్న‌ది ప‌క్క‌న పెడితే ఈ వార్త మాత్రం అంద‌రినీ చాలా ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. కాగా ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ది రాజా సాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News