తన పేరున చిల్లి గవ్వ లేకుండా భార్యకు 100కోట్ల ఆస్తి రాసిచ్చిన నటుడు!
ప్రముఖ నటుడు, దర్శకరచయిత పోసాని కృష్ణమురళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిల్లిగవ్వ కూడా తన పేరున ఉంచుకోకుండా తన ఆస్తులన్నింటినీ భార్య పేరిట కాగితం రాసిచ్చానని ప్రకటించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
ప్రస్తుత ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు, ఆర్థిక లావాదేవీల చుట్టూ అనేక మార్పులు, వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు కుటుంబంలో భార్యాభర్తల మధ్య నమ్మకం అనేది సహజ సిద్ధమైన గుణంగా ఉండేది. కానీ నేటి డిజిటల్-లీగల్ యుగంలో ఆస్తుల పంపకాలు, యాజమాన్య హక్కుల విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. లక్షల్లో సంపాదించే ఉన్నత ఉద్యోగుల నుండి రోజువారీ ఐదు వందలు.. ఎనిమిది వందలు... వెయ్యి రూపాయల కూలీ తెచ్చుకునే వారి వరకు ఎవరైనా సరే తమ కష్టార్జితాన్ని లేదా వారసత్వ ఆస్తులను భార్య పేరిట పూర్తిగా రాసివ్వడానికి వెనుకాడుతున్న తరుణంలో.. వందల కోట్ల రూపాయల ఆస్తిని ఏ విధమైన స్వార్థం లేకుండా భార్య పేరు మీద పెట్టడం అనేది ఒక విలక్షణమైన- విప్లవాత్మకమైన నిర్ణయంగా కనిపిస్తుంది.
ప్రముఖ నటుడు, దర్శకరచయిత పోసాని కృష్ణమురళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిల్లిగవ్వ కూడా తన పేరున ఉంచుకోకుండా తన ఆస్తులన్నింటినీ భార్య పేరిట కాగితం రాసిచ్చానని ప్రకటించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. నేటి రోజుల్లో బయటి సమాజం ఉన్న పరిస్థితిని చూసి చిన్న ఉద్యోగులే భార్య పేరిట ఆస్తులు పెట్టడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ సాహసం చేయని ఈ తరుణంలో వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తిని భార్య పేరిట పెట్టడానికి గల కారణాన్ని హోస్ట్ ప్రశ్నించారు. దీనికి పోసాని స్పందిస్తూ..తనకు భౌతిక సంపద కంటే ఉన్న అత్యంత పెద్ద ఆస్తి తన భార్యేనని ఎంతో భావోద్వేగంతో సమాధానమిచ్చారు.
ఈ విధమైన ధోరణి వెనుక ఉన్న వ్యక్తిగత జీవన తత్వాన్ని పరిశీలిస్తే... డబ్బు - విలాసాల కంటే జీవిత భాగస్వామికి ఇచ్చే స్థానమే అత్యున్నతమైనదని స్పష్టమవుతోంది. ``డబ్బు అనేది వెంట్రుకతో సమానం, ఇవాళ వస్తుంది రేపు పోతుంది`` అనే పాత సామెతను గుర్తు చేస్తూ..డబ్బు వల్ల కేవలం వినోదం.. విలాసాలు మాత్రమే ఉంటాయని.. కానీ నిజమైన సంతోషం ఉండదని పోసాని అభిప్రాయపడ్డారు. పెళ్లయిన నాటి నుండి నేటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉంటున్న తమ బంధంలో భార్యను ఒక పెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌గా, ఆస్తిగా భావించడం వల్లే ఆమె చదువుకుంటున్న రోజుల్లోనే పెళ్లి నిశ్చయమైన నాటి నుండి నేటి వరకు అదే నమ్మకాన్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
సమాజంలో డబ్బు చుట్టూనే బంధాలు తిరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్న ఈ రోజుల్లో... భౌతిక సంపదను కాకుండా భాగస్వామిని నమ్మి సర్వస్వాన్ని అప్పగించే ఇలాంటి నిస్వార్థ నిర్ణయాలు ఆదర్శవంతంగా నిలుస్తాయి. చట్టపరమైన వివాదాలు, కుటుంబ బంధాల విచ్ఛిన్నం ఎక్కువగా జరుగుతున్న ఆధునిక కాలంలో... ఇటువంటి చర్యలు అటు నైతికంగా భార్యాభర్తల మధ్య ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని చాటిచెప్పడమే కాకుండా..మహిళకు కుటుంబంలో అత్యున్నత ఆర్థిక భద్రతను - గౌరవాన్ని కల్పిస్తాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో బంధాల విషయంలో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ఇటువంటి వ్యక్తిగత నిర్ణయాలు ఎంతగానో దోహదపడతాయి. అయితే ఈరోజుల్లో భార్య పేరిట ఆస్తులు రాసిచ్చే వాడిని అమాయకుడు అనే ఒక సెక్షన్ ప్రజలు కూడా లేకపోలేదు. అలాంటి వారికి పోసాని జవాబుదారీ కానే కాదని భావించాలి.
నేటిరోజుల్లో ప్రాక్టికల్ కోణంలో విశ్లేషిస్తే.. చట్టపరమైన రక్షణలు, పన్ను మినహాయింపులు లేదా వ్యాపారపరమైన ఇబ్బందుల నుండి కుటుంబ ఆస్తిని సురక్షితంగా ఉంచే వ్యూహాత్మక నిర్ణయంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. సమాజంలో కేవలం డబ్బు చుట్టూనే బంధాలు తిరుగుతున్నాయనే ఈ రోజుల్లో.. భార్యను గొప్ప ఆస్తిగా భావించి సర్వస్వాన్ని ఆమెకు అప్పగించే ఇలాంటి నిర్ణయం అటు నైతికంగా ఆదర్శవంతమైన బంధాన్ని చాటుతూనే... ఇటు మహిళకు కుటుంబంలో అత్యున్నత ఆర్థిక భద్రతను, గౌరవాన్ని కల్పిస్తూ పూర్తి సమంజసంగా నిలుస్తోంది.