టాక్సిక్ విడుదలకు ముందే క్రేజీ అప్డేట్.. అందరి కళ్ళు దానిపైనే!
రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం "టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్" రిలీజ్‌కు రెడీ అవుతోంది.
రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం "టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్" రిలీజ్‌కు రెడీ అవుతోంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ ఆగస్టు 26,న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుండటంతో, తదుపరి అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
టీజర్‌తోనే మైండ్ బ్లాక్:
ఈ సినిమా ప్రమోషన్స్ చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. మొదట వచ్చిన 'లేడీస్, లేడీస్' టీజర్ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. యశ్ సరికొత్త లుక్, గీతూ మోహన్‌దాస్ టేకింగ్ చూసి సినిమా రేంజ్ ఏంటో ఫ్యాన్స్‌కు అర్థమైపోయింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ సినిమా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
'తబాహీ' పాటతో సంచలనం:
ఇక రీసెంట్‌గా విడుదల చేసిన 'తబాహీ' వీడియో సాంగ్ అయితే ఇంటర్నెట్‌లో ఒక సంచలనమే సృష్టించింది. మామూలుగా లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసే పద్ధతికి భిన్నంగా, నేరుగా స్టైలిష్ అండ్ బోల్డ్ రొమాంటిక్ మ్యూజిక్ వీడియోను వదిలారు. ఇక ఇందులో యశ్, కియారా అద్వాణీల కెమిస్ట్రీ, వరల్డ్ క్లాస్ విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
క్రేజీ స్టార్ కాస్టింగ్:
ఈ సినిమాలో కేవలం యశ్ మాత్రమే కాదు, చాలామంది స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. కియారా అద్వాణీతో పాటు నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ లాంటి క్రేజీ యాక్టర్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్‌తో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
కో-రైటర్‌గా రాకింగ్ స్టార్:
ఈ సినిమాకు యశ్ కేవలం హీరోగానే కాకుండా, సహ-రచయితగా కూడా పని చేయడం విశేషం. ఇందులో ఆయన 'రాయ్' అనే పవర్‌ఫుల్ లీడ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఇక హీరోగా నటిస్తూనే కథా చర్చల్లో పాల్గొని సినిమాను మరింత బెస్ట్‌గా మార్చేందుకు యశ్ చాలా కేర్ తీసుకున్నట్లు ఇన్ సైడ్ టాక్.
నెక్స్ట్ ప్రమోషన్ ఓ రేంజ్ లో:
ఇప్పటికే వచ్చిన రెండు ప్రమోషనల్ అస్సెట్స్ సూపర్ హిట్ అవ్వడంతో, ఇప్పుడు అందరి దృష్టి నెక్స్ట్ రాబోయే అప్‌డేట్‌పైనే ఉంది. ఆగస్టు 26న సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో, మేకర్స్ నెక్స్ట్ ప్రమోషన్‌ను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ భారీ యాక్షన్ డ్రామా థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు.
భారీ రెమ్యూనరేషన్లు, అదిరిపోయే కాస్టింగ్‌తో ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకు దారితీసిన 'టాక్సిక్' సినిమాపై మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ప్రమోషన్ల జోరు చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర యశ్ మరోసారి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.