రష్మికకు విజయ్ 'క్యూట్' రిప్లై.. భయం ఎందుకు బ్యూటీ!

ఇక రష్మిక షేర్ చేసిన ఆ ఫోటోలో విజయ్ దేవరకొండ హాఫ్ ఫేస్ అత్యంత భయంకరంగా కనిపించింది.

Update: 2026-07-13 05:06 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ జంట గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట.. ఎట్టకేలకు ఈ ఏడాది జైపూర్ లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇకపోతే వివాహం తర్వాత ఎవరి సినిమాలలో వాళ్ళు బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం రణబాలి.

రణబాలి నుండి రష్మిక స్పెషల్ పోస్ట్..

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇకపోతే రష్మిక మందన్న జూలై 12వ తేదీన అనగా ఆదివారం రోజు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.. రణబాలి సినిమా సీక్వెన్స్ కి సంబంధించిన విజయ్ దేవరకొండ ఫోటోని షేర్ చేస్తూ.." నేను ఈ ఫోటోని షేర్ చేయవచ్చో లేదో నాకు తెలియదు. దీన్ని తీసేయమని చెబుతారేమో కూడా తెలియదు. కానీ విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్, మొత్తం డైరెక్షన్ టీం ఒక సీన్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఆ సన్నివేశాన్ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. పైగా ఈ విషయాన్ని మీతో చెప్పకుండా నేను అస్సలు ఉండలేకపోయాను" అంటూ తెలిపింది.

రష్మిక పోస్టుకి విజయ్ క్యూట్ రిప్లై..

ఇక రష్మిక చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అటు రణబాలి సినిమాపై ఈమె పెట్టిన పోస్టర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఇక రష్మిక షేర్ చేసిన ఆ ఫోటోలో విజయ్ దేవరకొండ హాఫ్ ఫేస్ అత్యంత భయంకరంగా కనిపించింది. ఇకపోతే రష్మిక షేర్ చేసిన పోస్ట్ కి బదులుగా నేడు ఆమె భర్త ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ ఫన్నీగా స్పందించారు. రణబాలి గురించి రష్మిక చేసిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ పై ఆమె భర్త విజయ్ దేవరకొండ స్పందిస్తూ.." క్యూటీ.. భయం కాదు డివైన్" అంటూ తన భార్యకు రిప్లై ఇచ్చారు.. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన భార్యను క్యూటీ అని సంబోధించడంతో అభిమానులు చాలా సంతోషంగా ఫీలవుతున్నారు. ఏది ఏమైనా ఈ జంట ఎప్పటికీ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుందని ముఖ్యంగా ఈ జంట పది కాలాల పాటు చల్లగా ఉండాలని అభిమానులు కోరుతున్నారు.

అలాంటి రికార్డు సృష్టించిన రష్మిక..

ఇక రష్మిక మందన్న విషయానికొస్తే.. ప్రస్తుతం మైసా సినిమా షూటింగ్లో ఆమె బిజీగా ఉన్నారు. అంతేకాదు సుమారుగా కొన్ని గంటల పాటు అండర్ వాటర్ లో యాక్షన్ సన్నివేశాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు అండర్ వాటర్ లో యాక్షన్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న లేడీగా రష్మిక మందన్న సరికొత్త రికార్డు సృష్టించింది. ఇకపోతే ఈ ఏడాది ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News