తప్పు జరిగిపోయింది.. బహిరంగంగా ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పిన పృథ్వీ!
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం 'ఐ నో బడి' తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం 'ఐ నో బడి' తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. 'సలార్' సినిమాతో మన దగ్గర మంచి క్రేజ్ తెచ్చుకున్న పృథ్వీరాజ్, ఆ నమ్మకంతోనే ఈ సినిమాను నేరుగా తెలుగులో రిలీజ్ చేశారు. కానీ బ్రాండింగ్ లోపాలు, టైటిల్ కన్ఫ్యూజన్ వల్ల సినిమాకు థియేటర్లలో సరైన రెస్పాన్స్ రాలేదు. ఈ ప్రమోషన్ల ఫెయిల్యూర్స్‌పై పృథ్వీరాజ్ స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
టైటిల్ కన్ఫ్యూజన్ పెద్ద మైనస్:
ఈ సినిమాకు జరిగిన పెద్ద పొరపాటు టైటిల్ విషయంలోనే. ప్రమోషన్ల సమయంలో అంతా 'ఐ నో బడి' అని ప్రచారం చేశారు. కానీ థియేటర్లలోకి వెళ్లి స్క్రీన్ మీద చూస్తే 'ఐ ఎవరూ లేరు' అని కనిపించింది. ఇక ఇంగ్లీష్‌ను తెలుగులోకి సరిగ్గా ట్రాన్స్‌లేట్ చేయకపోవడం వల్ల వచ్చిన ఈ తేడాతో ఆడియన్స్ పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయారు.
జీరో పబ్లిసిటీ ఎఫెక్ట్:
హీరో పృథ్వీరాజ్ స్వయంగా హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ, గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం పబ్లిసిటీ అసలు జరగలేదు. సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా చాలామంది జనాలకు తెలియలేదు. ఇక ప్రమోషన్స్ ఇంత వీక్‌గా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. థియేటర్ల దగ్గర జనాలు లేక బీసీ సెంటర్లలో కొన్ని చోట్ల షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి.
బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ:
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద 'లెనిన్' సినిమా హవా నడుస్తోంది. దీనికి తోడు ఇంగ్లీష్ డబ్బింగ్ మూవీ 'ఈవిల్ డెడ్ బర్న్', మరో డబ్బింగ్ సినిమా 'హృదయం మురళి' రేసులో ఉండటంతో 'ఐ నో బడి' కి థియేటర్లు దొరకడమే కష్టమైంది. పైగా మలయాళ కంటెంట్‌ను మన వాళ్లు ఓటీటీలో చూసేందుకే ఎక్కువ ఇష్టపడుతుండటంతో థియేటర్ల వైపు రాలేదు.
తప్పు ఒప్పుకున్న పృథ్వీరాజ్:
ఈ బ్రాండింగ్ తప్పులు, పబ్లిసిటీ ఫెయిల్యూర్స్ మీద హీరో పృథ్విరాజ్ సుకుమారన్ స్పందించారు. టైటిల్ ట్రాన్స్‌లేషన్ విషయంలో పెద్ద తప్పు జరిగిందని ఆయన ఓపెన్‌గా ఒప్పుకున్నారు. కేవలం ప్రెస్ మీట్ పెడితే సరిపోదని, గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్స్ మిస్ అయ్యాయని చెప్తూ, ఈసారికి తనను క్షమించమని, నెక్స్ట్ టైమ్ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని అభిమానులను కోరారు.
ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ కథతో వచ్చినప్పటికీ, కేవలం మార్కెటింగ్ లోపాల వల్లే ఈ సినిమా తెలుగులో వెనుకబడిపోయింది. ప్రస్తుతం 'వారణాసి' సినిమాలో విలన్‌గా నటిస్తూ తెలుగు మార్కెట్‌ను పెంచుకోవాలని చూస్తున్న పృథ్వీరాజ్.. ఈ సినిమా రిజల్ట్ నుంచి పాఠాలు నేర్చుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో గట్టిగా కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం..