ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయా.. జానకి మృతిపై గాయని సుశీల సంచలన స్టేట్మెంట్!
డెక్కన్ నైటింగేల్, గాన కోకిలగా పేరు ఘడించిన సింగర్ జానకి జూలై 11 శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో మైసూర్ లోని అపోలో హాస్పిటల్లో వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలతో.. చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగా మృతి చెందారు.
డెక్కన్ నైటింగేల్, గాన కోకిలగా పేరు ఘడించిన సింగర్ జానకి జూలై 11 శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో మైసూర్ లోని అపోలో హాస్పిటల్లో వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలతో.. చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగా మృతి చెందారు. ఆమె మరణాన్ని యావత్ దేశ సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మన మధ్య లేకపోయినా ఆమె స్వరం ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. అంతటి మహోన్నత వ్యక్తి స్వర్గస్తులవడంతో దేశ ప్రధానిని మొదలుకొని.. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఇక మైసూర్లో జూలై 12వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో ఎస్ జానకి అంత్యక్రియలను పూర్తి చేశారు.
జానకి మృతి పై సుశీల కన్నీటి పర్యంతం..
ఇకపోతే జానకి మృతి పట్ల మరో గాయని పి సుశీల ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇప్పుడు "వారి కళ్ళు చల్లబడ్డాయా ?" అంటూ సంచలన కామెంట్లు చేశారు. జానకమ్మ మరణంతో భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాదిమంది శ్రోతలను ఓలలాడించిన స్వర కోకిల ఇక లేరు అనే విషయంపై ఆమె అత్యంత సన్నిహితురాలు, సమకాలీనురాలైన మరో దిగ్గజ గాయని పి సుశీల ఆవేదన వ్యక్తం చేస్తూ.. తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా- సుశీల
అందులో భాగంగానే జానకమ్మ మృతిపై సుశీల స్పందిస్తూ గతంలో కొందరు వ్యక్తులు మా ఇద్దరి మధ్య లేనిపోని విభేదాలను సృష్టించడానికి చాలా గట్టిగానే ప్రయత్నించారు.. నా గురించి జానకికి, జానకి గురించి నాకు లేనిపోని అబద్ధాలు చెబుతూ.. మా మధ్య విభేదాలు సృష్టించారు. ముఖ్యంగా మమ్మల్ని మానసికంగా వేధించారు.. ఏడిపించారు.. ఇక మా ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించి నాటకం చూసిన దుర్మార్గులందరి కళ్లు ఇప్పుడు చల్లబడ్డాయా? అంటూ ఘాటుగా విమర్శించారు సుశీల. ఇక వారి కుట్రల పట్ల మానసిక వేదన అనుభవించామని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
ఏడుపు లోనుంచి కన్నీళ్లు రావట్లేదు..
ఇంకా సుశీల మాట్లాడుతూ.. "రెండు పర్వతాలు లాంటి వాళ్ళము మేము. అయితే ఆమెను దేవుడు దెబ్బ మీద దెబ్బ కొట్టి, ఇప్పుడు ఆఖరికి ఆమెను కూడా తీసుకెళ్లిపోయాడు. జానకి మరణంతో మ్యూజిక్కే లేదు. ఎన్ని రకాలు పాడుతుందో.. జానకి లాంటి సింగర్ మళ్లీ పుట్టరు. ఆమె గొంతులో చిన్న పిల్లలను మొదలుకొని పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో గొంతులను ఆమె అద్భుతంగా పలికేది. మగ, ముసలి,చిన్నపిల్లల గొంతులు కూడా చాలా అద్భుతంగా పలికేవారు. ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకోవాలో ఆవిడకు బాగా తెలుసు. ఆవిడ పక్కన నేను ఒక ఉత్సవ విగ్రహం మాత్రమే. నా సిస్టర్ జానకి ఈరోజు లేదంటే ఏం చేయాలి. ఏడుపు లోనుంచి కన్నీళ్లు కూడా రావట్లేదు.
ఆమెను సరస్వతి దేవి పిలిచి ఉంటుంది - సుశీల
సరస్వతి దేవి ఆవిడని పిలిచి ఉంటుంది అనుకుంటున్నా.. ఇక్కడ కచేరి పాడాలి నువ్వు.. వచ్చేసేయ్ అని తీసుకుపోయి ఉంటుంది. సరస్వతి దేవి.. ఆవిడను అక్కడ పెట్టుకోవడానికి పిలిచింది. జానకి నీ అదృష్టం ఎవరికీ రాదు. నామీద ఆవిడకి చెప్పి ఆవిడ మీద నాకు చెప్పి మా ఇద్దరినీ పీక్కుతున్నారు. ఏం సాధించారు.. ఆవిడ అన్ని సాధించింది.. ఇక సాధించడానికి ఏమీ లేదు.. ఇక ఆమె పరిపూర్ణ జీవితం పొందింది. ఇక ఆమెను సరస్వతీ తన దగ్గర పెట్టుకోవడానికి పిలిచింది" అంటూ సుశీల ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.