'లెనిన్‌'తో ఇతడు గుర్తుండి పోతాడు..!

అఖిల్‌ అక్కినేని హీరోగా మురళి కిషోర్‌ దర్శకత్వంలో వచ్చిన 'లెనిన్‌' సినిమాకు హిట్‌ టాక్ దక్కింది.

Update: 2026-07-13 06:32 GMT

అఖిల్‌ అక్కినేని హీరోగా మురళి కిషోర్‌ దర్శకత్వంలో వచ్చిన 'లెనిన్‌' సినిమాకు హిట్‌ టాక్ దక్కింది. అఖిల్‌ కెరీర్‌లో మొదటి కమర్షియల్‌ హిట్‌ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ సైతం లెనిన్‌ సినిమా టాక్‌ పట్ల సంతోషంగా ఉన్నారు. మొదటి మూడు రోజులు భారీ వసూళ్లు నమోదు అయినట్లు బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు. నిర్మాత నాగవంశీ సినిమాను కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌గా తేల్చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇక సినిమాలో అత్యంత కీలక పాత్రలో ప్రమోద్‌ నటించాడు. ఇతడి పాత్ర గురించి సినిమా చూసిన వారు ప్రముఖంగా మాట్లాడుకుంటున్నారు.

సలార్‌ సినిమాలో నటించిన ప్రమోద్‌..

సలార్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించిన కన్నడ నటుడు ప్రమోద్‌ కి లెనిన్‌ సినిమాలో మంచి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. సినిమాలో అతడి పాత్రకి ఉన్న స్క్రీన్‌ ప్రజెన్స్‌ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. హీరో పాత్ర తర్వాత ఎక్కువ సమయం కనిపించే పాత్ర ఇతడిదే అనడంలో సందేహం లేదు. వసంత్‌ అనే పాత్రలో నటించిన ప్రమోద్‌ నటన గురించి ప్రముఖంగా మాట్లాడుకుంటున్నారు. రివ్యూవర్స్‌ చాలా మంది వసంత్‌ పాత్రలో నటించిన కన్నడ నటుడు ప్రమోద్‌ చాలా బాగా చేశాడు అంటూ రాయడం జరిగింది. అందుకే చాలా మంది అసలు వసంత్‌ పాత్ర ఏంటి? కథలో అతడి ప్రాధాన్యత ఏంటి అనే ఆసక్తిని కనబర్చుతున్నారు. సినిమాలో వసంత్‌ పాత్ర ట్విస్ట్‌ బాగుందనే టాక్‌ కూడా వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రమోద్‌ యొక్క నటన అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.

లెనిన్ సినిమాతో స్టార్‌గా గుర్తింపు..

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో కన్నడ స్టార్స్‌ సందడి ఎక్కువ అయ్యింది. కన్నడ నటీనటులు తెలుగు సినిమాలకు బాగా సెట్‌ అవుతున్నారు. హీరోయిన్‌ రష్మిక మందన్న మొదలుకుని హీరో రిషబ్‌ శెట్టి వరకు అంతా కూడా టాలీవుడ్‌ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అనుకోని అవకాశంగా లెనిన్ రూపంలో ప్రమోద్‌ కి ఛాన్స్ దక్కింది. దక్కిన అవకాశంను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రమోద్‌ ముందు ముందు టాలీవుడ్‌లో మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. లెనిన్‌ చూసిన తర్వాత చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్‌ కచ్చితంగా ప్రమోద్‌ తో వర్క్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఒకరు ఇద్దరు ప్రమోద్‌ గురించి ఎంక్వౌరీ చేశారని టాలీవుడ్‌ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ప్రమోద్‌ కొత్త సినిమా తెలుగులో మొదలు అయ్యే అవకాశం ఉంది.

కన్నడ నటుడు ప్రమోద్‌..

టీవీ సీరియల్స్ తో కెరీర్‌ను ప్రారంభించిన ప్రమోద్‌ తక్కువ సమయంలోనే స్టార్‌ నటుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. 2015లో సినిమా ఇండస్ట్రీలో ప్రమోద్‌ అడుగు పెట్టాడు. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ చేసిన సినిమాలు చాలా తక్కువ అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న పరిచయాలతో వరుస సినిమాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ హడావిడి లేకుండా, పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ఇప్పుడు కూడా లెనిన్ సినిమాలో అతడి పాత్రకు ఉన్న ప్రాధాన్యత కారణంగానే సినిమాను ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ప్రమోద్‌ నటుడిగా టాలీవుడ్‌లోనే కాకుండా ముందు ముందు పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్‌డం దక్కించుకుని వరుస సినిమాలు చేస్తాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముందు ముందు గుర్తుండి పోయే నటుడిగా ప్రమోద్‌ నిలుస్తాడని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Tags:    

Similar News