ఫ్రాన్స్ అందాలను ఆస్వాదిస్తూ.. అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పూజిత!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా తక్కువ మంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు.;

Update: 2025-10-23 15:29 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా తక్కువ మంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు. టాలీవుడ్ లో ఎక్కువ శాతం మంది ఇతర భాష హీరోయిన్ల హవానే కొనసాగుతుంది. అలా కర్ణాటక,తమిళనాడు, ముంబై, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాల భామలే ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతూ ఉంటారు. టాలీవుడ్ లో తెలుగు వాళ్లు చాలా తక్కువ మంది హీరోయిన్లు ఉంటారు. అలాంటి వారిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజిత పొన్నాడ..ఆంధ్రప్రదేశ్ కు చెందిన పూజిత పొన్నాడ షార్ట్ ఫిలిం ద్వారా ఎంట్రీ ఇచ్చి 'తుంటరి' అనే మూవీతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సమయం దొరికితే చాలు ఎక్కువగా వెకేషన్స్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్స్ కి వెళ్లడానికే ఎక్కువగా ఇష్టపడుతుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఫ్రాన్స్ కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ నుంచీ ఫ్రెండ్స్ అందాలను ఆస్వాదిస్తూనే.. మరొకవైపు క్రూయీజ్ షిప్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో మళ్ళీ పూజిత వెకేషన్ మోడ్ లోకి వెళ్ళింది అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. తాజాగా పూజిత పొన్నాడ క్రూయీజ్ షిప్ లో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పూజిత అందాలు హైలెట్ అయ్యేలా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించింది.. అలా బ్లాక్ కలర్ డ్రెస్ లో క్రూయిజ్ షిప్ లో కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా సముద్రం వ్యూ,అక్కడి చుట్టుపక్కల ఉన్న లొకేషన్ అందాలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

ఈ "క్రూయీజ్ షిప్ తీర ప్రాంతాల్లో గ్లైడింగ్ చేస్తూ దాని చుట్టూ ఉన్న ప్రత్యేకమైన పట్టణాలను కవర్ చేస్తూ ఎన్నో అద్భుతమైన దృశ్యాలను చూపిస్తోంది" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం పూజిత పొన్నాడ పెట్టిన ఈ వెకేషన్ ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

పూజిత పొన్నాడ సినీ పర్సనల్ కెరియర్ గురించి చూసుకుంటే.. ఏపీలోని వైజాగ్ లో పుట్టి పెరిగిన పూజిత పొన్నాడ బీటెక్ పూర్తి చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా కొద్ది రోజులు పని చేసింది.ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఉప్మా తినేసింది అనే ఫిలింతో యాక్టింగ్ మొదలుపెట్టింది. టాలీవుడ్ లో నారా రోహిత్ హీరోగా వచ్చిన తుంటరి మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఊపిరి,రంగస్థలం, హ్యాపీ వెడ్డింగ్, ఓదెల రైల్వే స్టేషన్, మిస్ ఇండియా, వేర్ ఇస్ ది వెంకటలక్ష్మి, బ్రాండ్ బాబు, రావణాసుర, హరిహర వీరమల్లు వంటి సినిమాల్లో నటించింది. ఈ హీరోయిన్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ భాషలో కూడా కొన్ని సినిమాలు చేసింది. అలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుండి సినీరంగం వరకు పూజిత పొన్నాడ సక్సెస్ఫుల్ గా తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తుంది..

Tags:    

Similar News