• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాక్ ఆఫ్ ది టౌన్.. పూజా...

టాక్ ఆఫ్ ది టౌన్.. పూజా రెడ్ హాట్ లుక్

| తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ కి రెడ్ రైడింగ్ హుడ్ అని క్యాప్ష‌న్ ఇచ్చింది. దీనికి #వెడ్డింగ్ సీజ‌న్ అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించింది.

By - Tupaki Desk
Update: 2024-02-02 15:17 GMT

బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే కెరీర్ ప‌రంగా కొన్ని చిక్కుల‌ను ఎదుర్కొంటున్నా కానీ ఇప్పుడిప్పుడే రిక‌వ‌రీతో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ భామ కొన్ని వ‌రుస అవ‌కాశాల్ని కోల్పోయాక కూడా, నెల‌ల గ్యాప్ లో త‌దుప‌రి వ‌రుస‌గా ప‌లువురు అగ్ర హీరోల చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. ఇక‌పోతే పూజా సోష‌ల్ మీడియాల్లో త‌న గ్రిప్ ఏమాత్రం త‌గ్గ‌కుండా వరుస‌గా వేడెక్కించే ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా పూజా రెడ్ హాట్ లెహంగా యువ‌త‌రంలో ప్ర‌త్యేకించి చ‌ర్చ‌కు వ‌చ్చింది.


తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ కి రెడ్ రైడింగ్ హుడ్ అని క్యాప్ష‌న్ ఇచ్చింది. దీనికి #వెడ్డింగ్ సీజ‌న్ అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించింది. పెళ్లిళ్ల సీజ‌న్ కి త‌గిన‌ట్టుగానే ఈ డిజైన‌ర్ లెహంగా నిజంగా ఎంతో ఆక‌ర్షిస్తోంది. పూజా ఈ భారీ లెహంగాలో ఎంతో అందంగా ఉందంటూ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. షోల్డ‌ర్ లెస్ డిజైన‌ర్ టాప్ తో పూజా అగ్గి రాజేస్తోంద‌ని కితాబిచ్చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.


పూజా నెక్ట్స్ ఏంటి?

సింబు క‌థానాయ‌కుడిగా కమల్ హాసన్ నిర్మిస్తున్న ఓ భారీ చిత్రంలో పూజా అవ‌కాశం అందుకుంద‌ని క‌థనాలొస్తున్నాయి. సిలంబరసన్ TR అకా శింబు ఇటీవ‌ల బరువు తగ్గాక‌ కవందే- వెండు తనంత కాదు చిత్రాల‌తో విజ‌యాలు అందుకున్నాడు. గత సంవత్సరం పాతు తాల విడుదలైంది, ఆ తర్వాత కమల్ హాసన్ నిర్మించిన STR 48 చిత్రంలో సిలంబరసన్ న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి దేశింగు పెరియసామి దర్శకత్వం వహిస్తారని, కమల్ హాసన్ భారీ పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. ఈ చారిత్రాత్మక చిత్రం కోసం సిలంబరసన్ TR థాయ్‌లాండ్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడు. అతడు ద్విపాత్రాభినయం చేస్తార‌ని స‌మాచారం అందింది. అయితే చిత్ర బృందం ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు.


STR 48లో పూజా హెగ్డే సిలంబరసన్ స‌ర‌స‌న‌ నటిస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం టైటిల్‌ను వెల్లడిస్తూ ప్రకటన లేదా టీజర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. STR 48 స్టంట్ సన్నివేశాలతో పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. సిలంబరసన్ చివరి చిత్రం, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'పాతు తాలా' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే అతడి తదుపరి ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Actress 
  • Poojahegde 
  • Actresspooja 
  • Socialmedia 
  • Phototalk 
  • Gorgeouslooks 
  • Redattire 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS