ఇప్పుడు బుట్ట బొమ్మ పరిస్థితి ఏంటి..?

అందులోనూ పూజా హెగ్దే డీ గ్లామర్ లుక్ ఆమెకు అసలు సూటవ్వలేదు. పూజా బేబీ సినిమాలో ఉంది అంటే గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుంది.;

Update: 2025-05-02 01:30 GMT

బుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది ఐతే రాధే శ్యాం తర్వాత సడెన్ గా ఆమెకు ఛాన్సులు రాకుండా పోయాయి. తెలుగులో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కి సినిమాలు చేస్తే వర్క్ అవుట్ అవుతుంది కానీ ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా ఆమెకు రాలేదు. గుంటూరు కారం సినిమా నుంచి ఆమె ఎగ్జిట్ అవ్వడం కూడా పూజా హెగ్దే తెలుగు ఆఫర్లు రాకపోవడానికి కారణమని అంటారు. ఐతే తెలుగులో పరిస్థితి ఇలా ఉంటే కోలీవుడ్ లో అరకొర అవకాశాలతో నెట్టుకొస్తుంది పూజా హెగ్దే.

ఓ పక్క బాలీవుడ్ లో కూడా సినిమాలైతే చేస్తుంది కానీ అక్కడ సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంది. సల్మాన్ తో చేసిన సినిమా ఫ్లాప్ అవగా రీసెంట్ గా వచ్చిన షాహిద్ కపూర్ దేవ్ కూడా నిరాశ మిగిల్చింది. నెక్స్ట్ అమ్మడు వరుణ్ ధావన్ తో సినిమాకు రెడీ అవుతుందని తెలిసింది. ఐతే లేటెస్ట్ గా అమ్మడు కోలీవుడ్ హీరో సూర్యతో ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. తమిళ్ లో క్రేజీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజైంది.

ఐతే ఆ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న పూజా హెగ్దే తీరా రిజల్ట్ చూశాక డిజప్పాయింట్ అయ్యింది. సూర్య వింటేజ్ లుక్స్, మాస్ యాక్షన్ ఇవన్నీ ఉన్నా కేవలం కొద్దిమందికి అది కూడా కార్తీక్ సుబ్బరాజ్ స్టైల్ సినిమాలను ఇష్టపడే వారికే ఈ మూవీ నచ్చుతుంది. అందులోనూ పూజా హెగ్దే డీ గ్లామర్ లుక్ ఆమెకు అసలు సూటవ్వలేదు. పూజా బేబీ సినిమాలో ఉంది అంటే గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుంది.

అదే ఎక్స్ పెక్టేషన్స్ తో సినిమాకు వెళ్లిన వారు నిరాశ చెందుతున్నారు. పూజా హెగ్దే కూడా ఇక మీదట ఇలాంటి సినిమాలే చేయాలని అనుకుంటున్నా అంటూ చెప్పగా అమ్మడు ఈ సినిమా రిజల్ట్ తో షాక్ అయ్యే ఉంటుంది. కొంతమంది హీరోయిన్స్ డీ గ్లామర్ లుక్, నో మేకప్ లుక్ తో తమ అభినయంతో మెప్పిస్తారు. కానీ పూజా హెగ్దేకి గ్లామర్ పరంగానే క్రేజ్ ఉంది. సో తప్పకుండా అమ్మడు ఈ టైప్ రోల్స్ చేస్తే ఆమె కెరీర్ కి హెల్ప్ అవ్వడం సంగతి అటుంచితే ఉన్న ఇమేజ్ కూడా పోయి అసలు ఏ ఛాన్స్ లు రాకుండా ఉంటాయి. పూజా హెగ్దే మాత్రం ఈసారి తన నటనతో ఆడియన్స్ ని మెప్పిస్తా అని అనుకోగా రియాక్షన్ మాత్రం ఆమెను షాక్ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News