పూజా హెగ్డే.. ఇది మరో బిగ్ స్ట్రోక్?
లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా విగ్నేష్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట పూజా హెగ్డేనే ఎంపిక చేశారని వార్తలొచ్చాయి.;
టాలీవుడ్‌లో ఓ సమయంలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే, అందం, అభినయం, డాన్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. అల్లు అర్జున్‌తో చేసిన 'దువ్వాడ జగన్నాథం', మహేష్ బాబు సరసన 'మహర్షి', ప్రభాస్‌తో 'రాధేశ్యామ్', అప్పట్లో ఆమె కెరీర్‌కు జెట్ స్పీడ్ అందించాయి. బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత కూడా భారీ ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తూ దక్షిణాదినే కాదు, హిందీలోనూ పూజా క్రేజ్ పెరిగిపోయింది.
అయితే ఇటీవల ఆమె కెరీర్‌లో హిట్స్ పెద్దగా కనిపించడంలేదు. వరుసగా వచ్చిన 'బీస్ట్', 'ఆచార్య', 'రాధేశ్యామ్', తాజాగా 'రెట్రో' వంటి సినిమాలు ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో ఆమె హవా కాస్త తగ్గిపోయింది. ఈ ప్రభావం ఆమెకు దక్కాల్సిన కొత్త అవకాశాలపైనా పడుతోంది. అప్పట్లో మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన 'గుంటూరు కారం' నుండి పూజా తప్పుకోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ కూడా చేజారినట్టు సమాచారం.
లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా విగ్నేష్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట పూజా హెగ్డేనే ఎంపిక చేశారని వార్తలొచ్చాయి. కానీ ఆమె వరుస ఫ్లాపులు, రెమ్యునరేషన్ విషయంలో ఏర్పడిన గ్యాప్ కారణంగా మేకర్స్ చివరకు ఆమెను పక్కనబెట్టి మలయాళ బ్యూటీ మమితా బైజును తీసుకున్నారని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మమితా బైజు ఇటీవల 'ప్రేమలు' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె దళపతి విజయ్, సూర్యల సినిమాల్లో కూడా ఛాన్సులు దక్కించుకుంటోంది. ఇప్పుడు ధనుష్ సినిమాతో వచ్చిన ఈ కొత్త అవకాశం ఆమెకు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెడుతుందన్నది విశ్లేషకుల అంచనా. అయితే ఈ ఒక్క ఆఫర్ పూజా చేతికి తప్పినా, ఆమె చేతిలో మాత్రం ఇంకా భారీ ప్రాజెక్టులున్నాయి.
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న 'కూలీ' సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ తో మెరవబోతోంది. అలాగే దళపతి విజయ్, H వినోత్ కాంబోలో రూపొందుతున్న ‘జననాయకన్’, రాఘవ లారెన్స్ నటిస్తున్న 'కాంచన 4' వంటి చిత్రాల్లోనూ ఆమె భాగంగా ఉన్నారు. మొత్తానికి పూజా హెగ్డే తన స్టార్ ఇమేజ్‌తో పాటు గ్లామర్‌ని కొనసాగిస్తూ ఉండగా, తాజా ఆఫర్లు దక్కకపోవడం వల్ల పెద్దగా ఎఫెక్ట్ అయితే పడట్లేదు.