బుట్ట‌బొమ్మ‌ తెలుగులో ఇన్ని ప్రాజెక్ట్‌లు కోల్పోయిందా?

తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా ఒక ద‌శ‌లో భారీ డిమాండ్‌తో హాట్ టాపిక్‌గా నిలిచింది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. అల వైకుంఠ‌పుర‌ములో` వ‌ర‌కు సాఫీగా సాగిన పూజా హెగ్డే ప్ర‌యాణం ఆ త‌రువాత దారి త‌ప్పింది.;

Update: 2026-04-06 03:00 GMT

తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా ఒక ద‌శ‌లో భారీ డిమాండ్‌తో హాట్ టాపిక్‌గా నిలిచింది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే. అల వైకుంఠ‌పుర‌ములో` వ‌ర‌కు సాఫీగా సాగిన పూజా హెగ్డే ప్ర‌యాణం ఆ త‌రువాత దారి త‌ప్పింది. ఒక ద‌శ‌లో భారీ స్థాయిలో డిమాండ్ చేస్తూ వ‌రుస స్టార్ హీరోల సినిమాల్లో న‌టించిన పూజకు తెలుగులో ఇప్పుడు పెద్ద‌గా ఆవ‌కాశాలు లేవు అన‌డం కంటే ఏ స్టార్ ప్రొడ్యూస‌ర్ ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. కార‌ణం భారీ స్థాయిలో పారితోషిం డిమాండ్ చేస్తుండ‌ట‌మేన‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

త‌న వ‌ద్ద‌కు ఏ ప్రొడ్యూస‌ర్ వెళ్లినా పూజా హెగ్డే భారీగా పారితోషికం డిమాండ్ చేస్తోంద‌ట‌. ఆ కార‌ణంగానే త‌న‌ని తీసుకోవాల‌నుకున్న నిర్మాత‌లు చాలా మంది మ‌రో హీరోయిన్‌ని ఫైన‌ల్ చేసుకుంటున్నార‌ట‌. అలా ఇప్ప‌టి వ‌ర‌కు పూజా హెగ్డే తెలుగులో ప‌ది క్రేజీ ప్రాజెక్ట్‌ల‌ని వ‌దులుకోవాల్సి వ‌చ్చింద‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. పెరిగిన బ‌డ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని పూజా హెగ్డే డిమాండ్‌ని ప్రొడ్యూస‌ర్స్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోంది.

తెలుగులో `ఆచార్య‌` త‌రువాత పూజా హెగ్డే ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. తెలుగులో ప్ర‌య‌త్నాలు చేయ‌డం మానేసి త‌మిళ‌, హిందీ ఇండ‌స్ట్రీల‌పై దృష్టి సారించింది. హిందీలో ర‌ణ్‌వీర్ సింగ్‌తో `స‌ర్క‌స్‌`, స‌ల్మాన్ ఖాన్‌తో `కిసీకా భాస్ కిసీకా జాన్‌`, షాహీద్ క‌పూర్‌తో `దేవా`.., త‌మిళంలో సూర్య‌తో `రెట్రో` వంటి సినిమాల్లో న‌టించినా ఫ‌లితం లేకుండా పోయింది. ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో క‌లిసి రెండ‌వ సారి `జ‌న నాయ‌గ‌న్‌`లో న‌టిస్తే అది రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల ఇప్ప‌టికీ రిలీజ్‌కు నోచుకోవ‌డం లేదు.

ప్ర‌స్తుతం త‌మిళంలో లారెన్స్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంచైజ్‌ `కాంచ‌న 4`, హిందీలో వ‌రుణ్ ధావ‌న్‌తో `హై జ‌వానీ తో ఇష్క్ హోనాహై`లో న‌టిస్తోంది. వీటిపైనే ఈ అమ్మ‌డి భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది. ఇదిలా ఉంటే ఫైన‌ల్‌గా తెలుగులో మ‌రో క్రేజీ మూవీని ప‌ట్టేసింది బుట్ట‌బొమ్మ‌. దుల్కర్ స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 41వ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీని ఎస్ ఎల్‌వీ సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దీంతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌స్తుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News