అవెంజ‌ర్స్ డూమ్స్ డే : మార్వెల్ చరిత్రలోనే అత్యంత భారీ క్రాస్ ఓవర్ చిత్రం

ఈ ట్రైలర్‌లో రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రతి నాయకుడి పాత్ర అయిన డాక్టర్ డూమ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Update: 2026-07-20 19:26 GMT

'అవెంజ‌ర్స్' ఫ్రాంఛైజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీకి ముగింపు ప‌లికామ‌ని మార్వ‌ల్ స్టూడియోస్ ప్ర‌క‌టించిన త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు తీవ్ర భావోద్వాగానికి గురయ్యారు. అవెంజ‌ర్స్ - ఎండ్ గేమ్ ఎమోష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డానికి కార‌ణ‌మిదే. అయితే ఇప్పుడు ర‌క‌ర‌కాల ఫ్రాంఛైజీల్లోని క్రాస్ ఓవ‌ర్ పాత్ర‌ల‌తో అవెంజ‌ర్స్ - డూమ్స్ డే స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను క‌లిగిస్తోంది. తాజాగా రిలీజైన ట్రైల‌ర్ ఆద్యంతం రక్తి క‌ట్టించే ఎలిమెంట్స్ ని ఆవిష్క‌రించ‌డం విశేషం.

మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన అత్యంత భారీ చిత్రం 'అవెంజర్స్: డూమ్స్‌డే' అఫీషియల్ ట్రైలర్ కొద్ది సేప‌టి క్రితం విడుదలై ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆంథోనీ- జో రుస్సో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ ట్రైలర్‌లో రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రతి నాయకుడి పాత్ర అయిన డాక్టర్ డూమ్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మల్టీవర్స్ అంతటా యుద్ధం ప్రకటించిన డాక్టర్ డూమ్‌ను అడ్డుకోవడానికి మార్వెల్ సూపర్ హీరోలందరూ ఒకే వేదికపైకి రావడం కనిపించింది. ముఖ్యంగా థోర్ తన దైవిక శక్తులతో డాక్టర్ డూమ్‌ను ఎదుర్కొనే సన్నివేశాలు.. లైట్నింగ్ దాడులను డూమ్ తన చేతులతో అడ్డుకోవడం ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ తర్వాత మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుండి తప్పుకున్న క్రిస్ ఈవాన్స్ (కెప్టెన్ అమెరికా) మళ్లీ తిరిగి రావడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ట్రైలర్ ముగింపులో థోర్ తన ఆయుధం మ్యోల్నిర్‌ను గాల్లోకి విసిరినప్పుడు.. క్రిస్ ఈవాన్స్ పాత్ర దానిని గాల్లోనే పట్టుకోవడం ఆక‌ట్టుకుంది.

ఈ సినిమాలో ఫాక్స్ సంస్థకు చెందిన ఎక్స్-మెన్ క్యారెక్టర్లైన ప్రొఫెసర్ జేవియర్, సైక్లోప్స్, మిస్టీక్, మాగ్నెటో , గాంబిట్ వంటి పాత్రలు నేరుగా ఎవెంజర్స్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాయి. వారితో పాటు ఫెంటాస్టిక్ ఫోర్, థండర్‌బోల్ట్స్ బృందాలు కూడా మల్టీవర్స్‌ను కాపాడే ఈ సుదీర్ఘ పోరాటంలో భాగమయ్యారు. డూమ్స్‌డేలో మళ్లీ X-మెన్, ఫెంటాస్టిక్ ఫోర్, అవెంజెర్స్‌‌లోని క్యారెక్టర్స్ కనిపించడంతో ఫ్యాన్స్ లో మ‌ళ్లీ ఫీవ‌ర్ రాజుకుంది.

ఒకే ఫ్రేమ్‌లో పెడ్రో పాస్కల్, ఫ్లోరెన్స్ ప్యూ, సెబాస్టియన్ స్టాన్, చియాంగ్ టాటమ్, పాట్రిక్ స్టీవర్ట్ , ఇయాన్ మెక్‌కెల్లెన్ వంటి హాలీవుడ్ దిగ్గజ నటులు కనిపించడంతో ఈ సినిమా మార్వెల్ చరిత్రలోనే అత్యంత భారీ క్రాస్ ఓవర్ చిత్రంగా నిలవబోతోంది.

Full View
Tags:    

Similar News