ఇక ఆలస్యం లేదు.. అజిత్ నెక్స్ట్ మూవీపై కోలీవుడ్ బాక్సాఫీస్‌కు భారీ ఊరట!
2026లో కోలీవుడ్ లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్ లో అజిత్ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కొత్త సినిమా గురించి గత కొన్ని నెలలుగా ఎన్నో ఊహాగానాలు వినిపించినా, ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న ఈ ప్రాజెక్ట్ మళ్లీ వేగం అందుకోనున్న సంకేతాలు కనిపిస్తుండటంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా సినిమా నిర్మాణ ప్రక్రియ ఇక ఆలస్యం కాకుండా ముందుకు సాగే దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు ఇండస్ట్రీకి సానుకూలంగా మారాయి.
అజిత్ రీసెంట్ టైమ్ లో సినిమాల కంటే తన పర్సనల్ ఇంట్రెస్ట్‌లు, ఇంటర్నేషనల్ మోటార్‌స్పోర్ట్స్‌కు ఎక్కువ టైమ్ కేటాయించడంతో ఆయన తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్న తరచూ వినిపించింది. అయితే ఇప్పుడు ఆ నిరీక్షణ ముగిసే దశకు చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక స్టార్ హీరో గ్యాప్ తీసుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ కేవలం ఫ్యాన్స్ పైనే కాదు, థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ సంస్థలు, విదేశీ మార్కెట్ వరకు విస్తరిస్తుంది. అందుకే అజిత్ కొత్త సినిమా కదలికలను ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.
2026లో కోలీవుడ్ లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల లిస్ట్ లో అజిత్ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోల సినిమాలు వరుసగా లైన్లో ఉన్నప్పటికీ, అజిత్ సినిమా అనౌన్స్‌మెంట్ పై మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది. దీనికి మెయిన్ రీజన్ ఆయనకున్న స్ట్రాంగ్ మార్కెట్‌తో పాటు ప్రతి సినిమా ఈవెంట్‌లా మారిపోవడమే. రీసెంట్ టైమ్ లో భారీ బడ్జెట్ సినిమాలు ప్రారంభం కావడానికి ముందే నెలల తరబడి ప్లాన్స్ రూపొందించడం సాధారణంగా మారింది. స్క్రిప్ట్ నుంచి లొకేషన్లు, టెక్నికల్ టీమ్, షూటింగ్ షెడ్యూల్స్ వరకు ప్రతి అంశాన్ని పక్కాగా ప్లాన్ చేసిన తర్వాతే సెట్స్‌పైకి వెళ్లే ధోరణి పెరిగింది. ఆ కారణంగా కొంత ఆలస్యం జరిగినా, ఒకసారి వర్క్స్ ప్రారంభమైతే వేగంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అజిత్ నెక్ట్స్ మూవీ కూడా అదే దిశగా ముందుకు సాగుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఒకసారి షూటింగ్ మొదలైతే ఈ సినిమా 2026-27 కోలీవుడ్ లో మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచే అవకాశాలున్నాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రస్తుతానికైతే ఓ విషయం స్పష్టమవుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆలస్యం అనే మాటకు తెరపడే సమయం ఆసన్నమైంది.