ట్రెండీ అవుట్ ఫిట్ తో పూజా హెగ్డే గ్లామర్ లుక్!

వరుసగా అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే.. కథల ఎంపిక విషయంలో కాస్త తడబడ్డ పూజా హెగ్డే.. మళ్లీ ఆ ఫ్లాప్ ల నుండి తేరుకోవడం లేదు.

Update: 2026-07-27 09:07 GMT

ఒక లైలా కోసం అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన పూజా హెగ్డే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, నటనతో ఆకట్టుకుంటున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి.. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురం సినిమాలో హీరోయిన్ గా నటించి.. బుట్ట బొమ్మగా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ..ఆ తర్వాత నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా కూడా ఈమెకు మంచి ఇమేజ్ అందించింది.



 


వరుసగా అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే.. కథల ఎంపిక విషయంలో కాస్త తడబడ్డ పూజా హెగ్డే.. మళ్లీ ఆ ఫ్లాప్ ల నుండి తేరుకోవడం లేదు. ఈమె నటించిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గా నిలుస్తుండడంతో చాలామంది ఈమెపై ఐరన్ లెగ్ ముద్ర వేశారు. ఇకపోతే సినిమాలలో ఫ్లాప్ అందుకుంటున్నప్పటికీ ఇటు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ సరికొత్త గ్లామర్ టచ్ తో ఆడియన్స్ లో కొత్త జోష్ నింపుతోంది పూజా హెగ్డే.



 


అందులో భాగంగానే తాజాగా మరో ట్రెండీ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ లేటెస్ట్ అవుట్ ఫిట్ ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. తాజాగా పూజా హెగ్డే తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ విషయానికి వస్తే.. బ్రౌన్ కలర్ టూ పీస్ కో ఆర్డ్ సెట్ ధరించింది. స్ట్రక్చర్ ప్లస్ టాప్ కి దీనికి సరిగ్గా సరిపోయే వేస్టెడ్ వైడ్ లెగ్ ట్రౌజర్ తో తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది. ముఖ్యంగా ఈమె ధరించిన టాప్ విషయానికి వస్తే.. టాప్ మధ్యలో డివైడ్ చేసినట్టు డిజైన్ చేసిన ఓవర్ ల్యాప్ పెప్లం గల స్ట్రాప్ లెస్ బ్యాండ్యూ సిల్హౌట్ టాప్ ను ధరించింది. బాటమ్ హై రైజ్, రిలాక్స్డ్ వైడ్ లెగ్ ప్యాంటు ఈమె అందాన్ని రెట్టింపు చేసింది. పైగా ఈ ఔట్ఫిట్ కి కాంబినేషన్ లో హై హీల్ ధరించింది ఈ ముద్దుగుమ్మ. బరువైన బంగారు గొలుసు, చౌకర్ నెక్లెస్ తో చాలా అందంగా సింపుల్ గా కనిపించింది.. ఇక పూజ హెగ్డే ధరించిన ఈ సింపుల్ ట్రెండీ ఔట్ ఫిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.



 


పూజా హెగ్డే నటించిన సినిమాలు విషయానికి వస్తే.. అటు హిందీలో హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే సినిమాలో నటించిన ఈమె.. మరొకవైపు తమిళ్లో విజయ్ చివరి సినిమా జననాయగన్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న DQ 41 శ్రీ శ్రీ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం అమ్మడి ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. మరి ఈ సినిమా పూజా హెగ్డే కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.



 


Tags:    

Similar News